గబ్బా టెస్టు: ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 369  
close

ప్రధానాంశాలు

Updated : 16/01/2021 08:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గబ్బా టెస్టు: ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 369   

మెరిసిన శార్దుల్‌‌, వాషింగ్టన్‌, నటరాజన్‌

బ్రిస్బేన్‌: టీమ్‌ఇండియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌటైంది. శనివారం ఉదయం 274/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజుఆట కొనసాగించిన ఆ జట్టు మరో 95 పరుగులు చేసి చివరి 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ టిమ్‌పైన్‌(50), కామెరూన్‌ గ్రీన్‌(47) రాణించారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 111 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే ప్రమాదకరంగా మారుతున్న వీరిని శార్దుల్‌ ఠాకుర్‌ విడదీశాడు. 

పైన్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాక శార్దుల్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో రోహిత్‌ చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్‌లోనే గ్రీన్‌ను వాషింగ్టన్‌ సుందర్‌ బౌల్డ్‌ చేశాడు. మళ్లీ మరుసటి ఓవర్‌లోనే శార్దుల్‌.. కమిన్స్‌(2)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా 315 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. ఆపై లైయన్‌(24; 22బంతుల్లో 4x4), మిచెల్‌ స్టార్క్‌(20*; 35 బంతుల్లో 1x6) ధాటిగా ఆడి జట్టు స్కోర్‌ను 350 దాటించారు. చివర్లో హేజిల్‌వుడ్‌(11)ను నటరాజన్‌ బౌల్డ్‌ చేయడంతో ఆస్ట్రేలియా 115.2 ఓవర్లలో 369 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆటలో మార్నస్‌ లబుషేన్‌(108; 204 బంతుల్లో 9x4) శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇక భారత బౌలర్లలో శార్దుల్‌, వాషింగ్టన్‌, నటరాజన్‌ మూడేసి వికెట్లు తీయగా, సిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

ఇవీ చదవండి..
శతకం చేశాక సెలబ్రేట్‌ చేసుకోను: లబుషేన్‌
అభిమానుల దుశ్చర్య:సిరాజ్‌పై వ్యాఖ్యలు

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 52
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 53
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన