KKR Vs DC: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ లక్ష్యం 128
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 28/09/2021 17:55 IST

KKR Vs DC: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ లక్ష్యం 128

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ బౌలర్లు విజృంభించారు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ.. తొమ్మిది వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. స్టీవ్‌ స్మిత్‌(39; 34 బంతుల్లో 4 ఫోర్లు), రిషభ్‌ పంత్‌ (39; 36 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. ఐదో ఓవర్‌లో దిల్లీ మొదటి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(24; 20 బంతుల్లో 5 ఫోర్లు)ను ఫెర్గూసన్‌ ఔట్‌ చేశాడు. తర్వాత వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌(1)ని సునీల్‌ నరైన్‌ పెవిలియన్ చేర్చాడు. చక్రవర్తి వేసిన పదో ఓవర్లో స్మిత్ రెండు ఫోర్లు బాదాడు. ప్రమాదకరంగా మారుతున్న స్మిత్‌ని ఫెర్గూసన్‌ ఔట్‌ చేశాడు. హెట్‌మయర్ (4), లలిత్‌ యాదవ్‌(0), అక్షర్ పటేల్‌(0), అశ్విన్‌(9) నిరాశపర్చారు. కోల్‌కతా బౌలర్లలో నరైన్‌, ఫెర్గూసన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సౌథీ ఒక వికెట్ తీశాడు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన