IPL 2021: ముంబయి ఇండియన్స్‌ని అడ్డుకోగల సత్తా.. ఆ జట్టుకే ఉంది: బ్రాడ్‌ హగ్‌
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 16/09/2021 18:02 IST

IPL 2021: ముంబయి ఇండియన్స్‌ని అడ్డుకోగల సత్తా.. ఆ జట్టుకే ఉంది: బ్రాడ్‌ హగ్‌

ఇంటర్నెట్‌ డెస్కు: డిఫెండింగ్‌ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌ని అడ్డుకోగల దమ్ము దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకే ఉందని మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హగ్‌ అన్నాడు. కరోనా కారణంగా ఐపీఎల్‌ అర్ధాంతరంగా వాయిదా పడటంతో దిల్లీ జట్టుకు కలిసొచ్చిందని పేర్కొన్నాడు. భుజం గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమైన శ్రేయస్‌ అయ్యర్, కరోనా కారణంగా ఈ సీజన్‌ నుంచి తప్పుకున్న సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌లు తిరిగి జట్టులోకి వచ్చారు. దీంతో ఆ జట్టు మరింత బలోపేతమైందని పేర్కొన్నాడు. సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్‌ మలి దఫా మ్యాచులు ప్రారంభం కానున్నాయి. 

‘డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ మరో టైటిల్ గెలవకుండా అడ్డుకోగల సత్తా ఒక్క దిల్లీ క్యాపిటల్స్‌కే ఉంది. సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ రాకతో దిల్లీ క్యాపిటల్స్‌ మరింత బలోపేతమైంది. ఇకపై ఆ జట్టు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌పై భారం వేయాల్సిన అవసరం లేదు. మరోవైపు, బౌలింగ్‌ విభాగంలో యువ సంచలనం అవేశ్ ఖాన్‌ ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్‌లో 14 వికెట్లు తీసి దిల్లీ విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. కోచ్ రికీ పాటింగ్‌ ప్రోత్సాహంతో అతడు మరింత రాటుదేలాడు. ప్రస్తుతం ఆ జట్టులో సమతూకం కనిపిస్తోంది’ అని బ్రాడ్‌ హగ్‌ తెలిపాడు. ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో ఆ జట్టు ఆరింటిలో విజయం సాధించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన