close

ప్రధానాంశాలు

Published : 09/03/2021 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మగాళ్ల కంటే మీరే బలవంతులు: కోహ్లి

దిల్లీ: అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకుని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తన భార్య అనుష్క శర్మ, తనయ వామిక ఫొటోను పోస్టు చేశాడు. అందులో వామిక వైపు చూస్తూ అనుష్క నవ్వులు చిందిస్తూ ఉంది. ‘‘ఓ బిడ్డకు జన్మనిస్తుండగా చూడడమే వెన్నులో వణుకు పుట్టించే, నమ్మశక్యం కాని అద్భుతమైన అనుభూతి. మనిషికి ఇంతకన్నా గొప్ప అనుభవం ఏముంటుంది. దానికి సాక్ష్యంగా నిలిచిన తర్వాత ఓ మహిళకున్న నిజమైన బలం, తన దైవత్వం అర్థమవుతాయి. వాళ్ల లోపల మరో జీవాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడో తెలుస్తుంది. ఎందుకంటే వాళ్లు పురుషుల కంటే ఎంతో బలవంతులు. నా జీవితంలోని అత్యంత దృఢమైన, దయ కలిగిన, బలమైన మహిళతో పాటు తన అమ్మలాగే ఎదగబోతున్న నా చిన్నారికి మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ప్రపంచంలోని అద్భుతమైన మహిళలందరికీ నా శుభాకాంక్షలు’’ అని ఆ పోస్టుకు కోహ్లి వ్యాఖ్య జతచేశాడు. తమ కుమార్తెకు వామిక అని పేరు పెట్టినట్లు ఇదివరకే విరుష్క జోడీ వెల్లడించిన సంగతి తెలిసిందే.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన