గట్టి దెబ్బే
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 25/03/2021 01:44 IST

గట్టి దెబ్బే

 వన్డే సిరీస్‌ నుంచి శ్రేయస్‌ ఔట్‌
 ఐపీఎల్‌కూ దూరం?

భారత బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయం వల్ల ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో ఇక ఆడడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తుండగా అతడి భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స చేయించకోవాల్సిన స్థితిలో అతను ఐపీఎల్‌ మొత్తానికి దూరం కానున్నట్లు వార్తలొస్తున్నాయి.
పుణె: ఇంగ్లాండ్‌తో తొలి వన్డే సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డ భారత బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సిరీస్‌లో మిగిలిన రెండో వన్డేలకు దూరమయ్యాడు. అతను ఐపీఎల్‌లోనూ ఆడటం అనుమానంగానే ఉంది. ముందు టోర్నీ ప్రథమార్ధానికి దూరమవుతాడని వార్తలొచ్చాయి. తర్వాత టోర్నీ మొత్తానికి దూరం అంటున్నారు. మంగళవారం మ్యాచ్‌ సందర్భంగా బెయిర్‌స్టో కొట్టిన బంతిని ఆపడం కోసం డైవ్‌ చేసిన శ్రేయస్‌.. భుజం నొప్పితో విలవిల్లాడు. అతడి భుజం స్థానభ్రంశం చెందినట్లు పరీక్షల్లో తేలింది. ‘‘శ్రేయస్‌ ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేదు’’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. శ్రేయస్‌ ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌. అతడి సారథ్యంలోని దిల్లీ గత ఐపీఎల్‌లో ఫైనల్లో అడుగుపెట్టింది. శ్రేయస్‌ గాయం తగ్గడానికి కనీసం ఆరు వారాలు పట్టొచ్చు. శస్త్రచికిత్స అవసరమైతే.. కోలుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. అప్పుడు అతడు ఐపీఎల్‌ టోర్నీ మొత్తానికి దూరం కావొచ్చు. శ్రేయస్‌ స్థానంలో తుది జట్టులో ఆడేందుకు  పంత్‌తో పాటు సూర్యకుమార్‌, గిల్‌ సిద్ధంగా ఉన్నారు.
దిల్లీ కెప్టెన్‌ ఎవరు?: ఐపీఎల్‌-14 ఆరంభానికి ఇంకో రెండు వారాలే సమయం ఉండగా.. ఈ సీజన్‌కు సమరోత్సాహంతో సిద్ధమవుతున్న దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు శ్రేయస్‌ గాయం పెద్ద ఎదురు దెబ్బే. శ్రేయస్‌ సారథి అయ్యాక ఆ జట్టు ఆటతీరే మారిపోయింది. గత సీజన్లో చక్కటి ప్రదర్శనతో ఫైనల్‌ కూడా చేరింది. ఈసారి ఎలాగైనా టైటిల్‌ సాధించాలని చూస్తున్న ఆ జట్టుకు ఈ పరిణామం షాకే. శ్రేయస్‌ దిల్లీకి కెప్టెనే కాదు.. టాప్‌ ఆర్డర్‌లో కీలక బ్యాట్స్‌మన్‌ కూడా. అతడి గైర్హాజరీ అన్ని రకాలుగా జట్టును దెబ్బ తీసేదే. శ్రేయస్‌ వచ్చేంత వరకు వైస్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తున్నారు. అయితే ఈ సీజన్‌ నుంచే దిల్లీ జట్టుకు ఆడనున్న ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌తో పాటు సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నారు. 26 ఏళ్ల శ్రేయస్‌కు భుజం గాయం కావడం గత ఆరు నెలల్లో ఇది రెండోసారి. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా అతడు గాయపడ్డాడు. ఐపీఎల్‌ ఏప్రిల్‌ 9న ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన