UEFA Champions League: రెప్పపాటులో గోల్‌ కాకుండా ఆపాడు.!
Array ( [0] => stdClass Object ( [video_type] => 3 [video_short_link] => 1437906294745219077 ) ) 1

ప్రధానాంశాలు

Published : 16/09/2021 02:20 IST

UEFA Champions League: రెప్పపాటులో గోల్‌ కాకుండా ఆపాడు.!

ఇంటర్నెట్‌ డెస్కు : యూనియన్‌ ఆఫ్‌ యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (యూఈఎఫ్‌ఎ) ఛాంపియన్స్‌ లీగ్‌లో అద్భుతం చోటు చేసుకుంది. అట్లాంటా గోల్‌ కీపర్‌ జువాన్‌ ముస్సో రెప్పపాటులో గోల్‌ కాకుండా ఆపాడు. దీంతో అట్లాంటా, విల్లార్రియల్‌ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌ 2-2 స్కోర్లతో డ్రాగా ముగిసింది.

యూఈఎఫ్‌ఎ ఛాంపియన్స్‌ లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచులో మొదటి సగం ఆట పూర్తయ్యేసరికి ఇరు జట్లు 1-1 స్కోర్లతో సమంగా నిలిచాయి. అనంతరం ప్రారంభమైన రెండో సగంలో కూడా ఇరు జట్లు పోటాపోటీగా ఆడి 2-2 స్కోర్లతో సమంగా నిలిచాయి. ఈ క్రమంలోనే మరి కొద్దిసేపట్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా ప్రత్యర్థి జట్టు ఆటగాడు కొట్టిన గోల్‌ను ముస్సో రెప్పపాటులో అడ్డుకుని మ్యాచ్‌ని డ్రాగా ముగించాడు. మరో మ్యాచులో సెవిల్లా గోల్‌ కీపర్‌ యాసిన్‌ బోనౌ కూడా ఇదే రీతిలో గోల్‌ను అడ్డుకున్నాడు. ఆ రెండు వీడియోలను ఛాంపియన్స్‌లీగ్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసి, ఎవరు గొప్పగా ఆడారో తెలుపమని అభిమానులను కోరింది. అయితే, అభిమానుల నుంచి ఇద్దరికీ సమాన స్థాయిలో మద్దతు లభించడం గమనార్హం. ఆ అద్బుతమైన వీడియోను మీరూ చూసేయండి.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన