close

తాజావార్తలు

వరల్డ్‌కప్‌ జట్టులో రహానె, విజయ్‌శంకర్‌కు చోటు?

చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌

ముంబయి: క్రికెట్‌ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రపంచ కప్‌ టోర్నీ మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఈ టోర్నిలో పాల్గొనే టీమిండియా జట్టును కూర్చేందుకు ఇటు సెలక్షన్‌ కమిటీ, బీసీసీఐ కసరత్తులు ప్రారంభించాయి. ఏప్రిల్‌ 23లోపు టీమిండియా జట్టును ప్రకటించాల్సి ఉండటంతో సెలక్షన్‌ కమిటీ ఆటగాళ్ల ప్రతిభను జల్లెడ పడుతోంది. ఈక్రమంలో ప్రపంచకప్‌లో పాల్గొన బోయే భారత జట్టులో అజింక్య రహానె, రిషభ్‌ పంత్‌, విజయ్‌ శంకర్‌లకు చోటు లభించే అవకాశాలు ఉన్నాయని చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నర్మగర్భంగా వెల్లడించారు.

‘తనకు వచ్చిన అవకాశాలను విజయ్‌ శంకర్‌ బాగా ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పటి వరకు అతడి ప్రతిభ బాగానే ఉంది. గత రెండేళ్లుగా అతడిని ఇండియా ‘ఏ’జట్టులో చూస్తూనే ఉన్నాం. ప్రపంచకప్‌ ఆడబోయే జట్టులో అతడు ఏ స్థానంలో సరిపోతాడో చూడాలి. అజింక్య రహానె గతేడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో వన్డేలు ఆడాడు. వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఓపెనర్ల జాబితాలో ఇతడిని మూడో ఆప్షన్‌గా ఎంచుకున్నాం. ప్రపంచకప్‌లో రహానెను ఆడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక పంత్‌ విషయానికికొస్తే అతడిని నిస్సందేహంగా వరల్డ్‌కప్‌ జట్టులోకి తీసుకోవచ్చు. గత ఏడాది కాలంగా అతడు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నాడు. అనతి కాలంలో పంత్‌ ఆటలో పరిణతి చెందాడు. అందుకే అతనికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం’ అని తెలిపారు.

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20ల్లో విజయ్‌శంకర్‌ మంచి ప్రదర్శనే చేశాడు. మరోవైపు అజింక్య రహానె సైతం ఇండియా ‘ఏ’లో 11 ఇన్నింగ్స్‌లో 597 పరుగులు చేశాడు. మరోవైపు రిషభ్‌ పంత్‌ సైతం న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మంచి పరుగులే చేశాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.