close

తాజావార్తలు


బేబీ సిట్టర్ అవతారం ఎత్తిన సెహ్వాగ్‌

వీడియో వైరల్‌

ఇంటర్నెట్ డెస్క్‌:‘బేబీ సిట్టర్‌’ ఈ మధ్య క్రికెట్‌లో బాగా వినిపిస్తున్న పేరు. దీనికి కారణం ముమ్మాటికీ రిషభ్‌ పంతే. టీమిండియా ఇటీవల ఆసీస్‌ పర్యటనకు వెళ్లినప్పుడు పంత్‌ బేబీ సిట్టర్‌ పేరుతో హాట్‌ టాపిక్‌గా మారాడు. ఇదే కథావస్తువు అనుకుందే ఏమో స్టార్‌ స్పోర్ట్స్‌ ఈ అంశంతో ఏకంగా యాడ్‌ తీసేసింది. ఇందతా టీమిండియా కోసమే అనుకోండి. ఈ నెల చివర్లో కంగారూ జట్టుకు, టీమిండియాకు మధ్య టీ20, వన్డే సిరీస్ పోరు ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో ప్రచారం కోసం స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రకటనను తయారు చేసింది. అందులో టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్ బేబీసిట్టర్‌ అవతారం ఎత్తాడు. ఈ వీడియోను స్టార్‌ స్పోర్ట్స్‌ రెండు రోజుల క్రితం యూట్యూబ్‌లో, సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. దీంతో ఈ వీడియో బాగా వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకు దీన్ని 4.9లక్షల మంది వీక్షించారు. మరి అంతలా వైరల్‌ అవుతోన్న వీడియో ఎలా ఉందో మీరు కూడా చూసేయండి!

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.