
తాజావార్తలు
రాంచీ: హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి టీ20 ఫలితం ఎలాగున్నా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని మీద మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనికి కారణం మహీ సమయస్ఫూర్తి. ఓ వ్యక్తి భద్రత సిబ్బందిని దాటుకుని మైదానంలోకి వెళ్లాడు. ధోని దగ్గరికెళ్లి పాదాభివందనం చేశాడు. ఐతే అతను కిందికి వంగే క్రమంలో చేతిలో ఉన్న భారత జాతీయ జెండా కింద పడబోతుంటే.. ధోని చురుగ్గా స్పందించి దాన్ని చేతికి తీసుకోవడంతో అతడిపై ప్రశంసల జల్లు కురిస్తోంది. అయితే ఈ విషయంపై ధోని చిన్ననాటి జవహర్ విద్యా మందిర్ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ఏకే సింగ్ కూడా స్పందించారు. ‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది మహీ. నువ్వు యువతకు ఆదర్శం. దేశభక్తికి ప్రచార కర్తలాంటి వాడివి. ఒక మ్యాచ్లో నువ్వు కోట్ల మంది హృదయాలను గెలుచుకోవడమే కాక, వారి మనోభావాలను కాపాడావు. మైదానంలో ఎంతో క్రమశిక్షణ చూపావు. నీకు గురువునైనందుకు గర్వంగా ఉంది. నువ్వింత గొప్పవాడికి అవడానికి కారణం నీకు జన్మనిచ్చిన తల్లి దేవికా దేవి కారణం. ఆమే నీకు మొదటి గురువు. ధోని అంటే ఏంటో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతడి జీవిత ప్రయాణాన్ని దగ్గరుండి గమనించాను. ఒక గురువుగా నేను ఇంతకంటే సంతోషించే సమయం రాదేమో!’ అని ధోని ని ఉద్దేశించి సింగ్ తెలిపారు.
What a player! pic.twitter.com/0K6ew0Pbx1
— Abhishek Pandey (@abhishekpnd63) February 10, 2019
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- ఇక ఆ హోటల్కి అస్సలు వెళ్లను: రకుల్
- వామ్మో..! రోడ్డుపై ఎంత పే..ద్ద యంత్రమో!!
- పుల్వామా దాడి: పక్కా ప్లాన్
- బాబుతో విభేదాలపై అశోక్ గజపతి రాజు క్లారిటీ
- దాడికి రావల్పిండి ఆస్పత్రి నుంచే మసూద్ ఆదేశాలు
- పాక్పై దాడి చేయండి: బలూచ్ పోరాట యోధులు
- వేర్పాటువాద నేతలకు భద్రత ఉపసంహరణ
- ప్రపంచకప్:భారత్-పాక్ మ్యాచ్ జరగడానికి వీల్లేదు
- వీర జవాను కుటుంబానికి అర ఎకరా భూమిస్తా
- ‘పెళ్లికి ముందే బిడ్డను కన్నాను’