close

తాజావార్తలు


కాల్పుల ఘటనతో బంగ్లా-న్యూజిలాండ్ టెస్టు రద్దు

క్రైస్ట్‌చర్చ్‌: బంగ్లాదేశ్‌-న్యూజిలాండ్‌ మధ్య శనివారం ప్రారంభంకావాల్సిన టెస్టు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థ ఈ విషయాన్ని ట్విటర్‌లో ప్రకటించింది. అంతకుముందు బంగ్లా ఆటగాళ్లు స్థానిక మసీదులో ప్రార్థనలకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండుగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ఆటగాళ్లు తృటిలో తప్పించుకున్నారు. ఈ దాడి అనంతరం వారు తీవ్ర భయాందోళనకు గురైన నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరగాల్సిన మూడో టెస్టు రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

బంగ్లాదేశ్‌ జట్టు అధికార ప్రతినిధి జలాల్‌ యూనిస్‌ ఈ విషయంపై స్పందించారు. ‘మా జట్టు ఆటగాళ్లు స్థానిక మసీదులో ప్రార్థనలకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకొని అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆటగాళ్లందరూ క్షేమంగానే ఉన్నారు. ఈ దాడి నేపథ్యంలో ఆటగాళ్లు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వారిని వెంటనే హోటల్‌కు తరలించి అక్కడే ఉండమని చెప్పాం’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు దుండగుల కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.