close

తాజావార్తలు

శ్రీశాంత్‌ జీవితకాల నిషేధాన్ని పక్కనపెట్టిన సుప్రీం  

బీసీసీఐ నిర్ణయంపై పునఃసమీక్షించాలని ఆదేశం

దిల్లీ: స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న క్రికెటర్‌ శ్రీశాంత్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది. శ్రీశాంత్‌పై విధించిన శాశ్వత బహిష్కరణను బీసీసీఐ పునఃసమీక్షించాలని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం శ్రీశాంత్‌ తరఫు న్యాయవాది దనలు విన్న ద్విసభ్య ధర్మాసనం బీసీసీఐని ఆదేశించింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసును మరోసారి విచారించి మూడు నెలల్లో సమాధానం చెప్పాలని జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం బీసీసీఐ క్రమశిక్షణ కమిటీని ఆదేశించింది.
శ్రీశాంత్‌ తరఫు న్యాయవాది సల్మాన్‌ ఖుర్షిద్‌ శుక్రవారం ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. 
‘కచ్చితమైన ఆధారాలు లేకుండా బీసీసీఐ.. శ్రీశాంత్‌పై నిషేధం విధించడం దారుణమన్నారు. 2013 ఐపీఎల్‌ సీజన్‌లో శ్రీశాంత్‌ స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని.. ఒక ఓవర్‌లో 14 పరుగులు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఆ ఓవర్‌లో శ్రీశాంత్‌ 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అసలు శ్రీశాంత్ మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడలేదు. ఇందుకు సంబంధించిన సరైన ఆధారాలు కూడా లేవు. కేవలం ప్రాథమిక సమాచారం ఆధారంగా శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధించడం సరికాదు’ అని ఆయన కోర్టుకు విన్నవించారు. 
క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బీసీసీఐ శ్రీశాంత్‌ను జీవితకాలం నిషేధించడం సరికాదని ఖుర్షీద్‌ వివరించారు. ఇదిలా ఉండగా 2018 ఆగస్టులో కేరళ హైకోర్టు కూడా బీసీసీఐ నిర్ణయాన్ని తోసిపుచ్చిందని అయినా బీసీసీఐ తన నిర్ణయం మార్చుకోలేదని పేర్కొన్నారు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఖుర్షీద్‌ తెలిపారు. కాగా బీసీసీఐ నిషేధం ఎత్తేస్తే శ్రీశాంత్‌ తిరిగి క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని ఆయన కోర్టుకు వివరించారు. 

అనంతరం శ్రీశాంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను 30 ఏళ్ల వయసులో ఇంకా ఫిట్‌నెస్‌గా ఉన్నాడని, బీసీసీఐపై తనకు నమ్మకముందని చెప్పాడు. బీసీసీఐ అధికారులు తనపై నిషేధాన్ని ఎత్తివేస్తే మళ్లీ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని శ్రీశాంత్‌ పేర్కొన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.