Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102889
            [news_title_telugu_html] => 

ఫ్లాట్‌ పిచ్‌లపై ఆట మాకు అలవాటే: యూజీ

[news_title_telugu] => ఫ్లాట్‌ పిచ్‌లపై ఆట మాకు అలవాటే: యూజీ [news_title_english] => Dont read much into indifferent Australia series tells Chahal [news_short_description] => ఆస్ట్రేలియా సిరీస్‌లో వైఫల్యం ప్రపంచకప్‌లో తమ ప్రదర్శనపై ప్రభావం చూపదని టీమిండియా మణికట్టు మాంత్రికుల్లో ఒకరైన యుజువేంద్ర చాహల్‌ అన్నాడు. మెగా టోర్నీల్లో తామిద్దరం మంచి ప్రదర్శన చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.... [news_tags_keywords] => yuzvendra chahal,kuldeep yadav,team india,worldcup 2019 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-25 00:16:34 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఫ్లాట్‌ పిచ్‌లపై ఆట మాకు అలవాటే: యూజీ - Dont read much into indifferent Australia series tells Chahal - EENADU
close

తాజావార్తలు

ఫ్లాట్‌ పిచ్‌లపై ఆట మాకు అలవాటే: యూజీ

దిల్లీ: ఆస్ట్రేలియా సిరీస్‌లో వైఫల్యం ప్రపంచకప్‌లో తమ ప్రదర్శనపై ప్రభావం చూపదని టీమిండియా మణికట్టు మాంత్రికుల్లో ఒకరైన యుజువేంద్ర చాహల్‌ అన్నాడు. మెగా టోర్నీల్లో తామిద్దరం మంచి ప్రదర్శన చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ‘ఆస్ట్రేలియా సిరీస్‌ గురించి ఎక్కవ విచారపడొద్దు. వారిపై ఎన్నో మ్యాచ్‌లు ఆడాం. ఆడిన ప్రతి మ్యాచ్‌ మనమే గెలవలేం కదా. బ్యాట్స్‌మెన్‌ ఆడిన విధానాన్ని బట్టి వారు విజయానికి అర్హులే. తర్వాత ఆసీస్‌తో ఆడే మ్యాచ్‌లో మెరుగ్గా బంతులు వేస్తాం’ అని యూజీ అన్నాడు.

‘గత ఆర్నెల్లలో కుల్‌దీప్‌, నాలో మార్పేమీ లేదు. జట్టు అవసరాలని బట్టి బంతులు వేస్తాం. ఇంగ్లాండ్‌లో ఫ్లాట్‌ పిచ్‌లను చూసి భయపడడం లేదు. అలాంటి వికెట్లకు అలవాటు పడ్డాం. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన చిన్నస్వామి మైదానంలో ఏటా నేను ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నా. ఫ్లాట్‌ పిచ్‌లపై నేను ఒత్తిడికి పడితే ప్రత్యర్థి బౌలర్‌ సైతం ఒత్తిడికి గురవుతాడు కదా’ అని చాహల్‌ అన్నాడు.

‘అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌కు బంతులు వేస్తున్నప్పుడు రక్షణాత్మక వ్యూహం అనుసరించొద్దు. రసెల్‌, వార్నర్‌ లాంటి ఆటగాళ్లు పరుగులు చేయకుండా అడ్డుకోలేం. వారిపై దాడి చేయాలి. అందుకే ప్రతి బంతిని అత్యుత్తమంగా వేసేందుకే ప్రయత్నిస్తాను. అతి పెద్దదైన ప్రపంచకప్‌కు వచ్చేందుకు ముందు జరిగే భారీ టోర్నీలో రాణించడం ముఖ్యం. ఐపీఎల్‌ విశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తుంది. గతంలో చదరంగం ఆడేటప్పుడు ఎత్తులు వేసేందుకు సంబంధిత పుస్తకాలు చదివేవాడిని. విశ్వనాథన్‌ ఆనంద్‌ వీడియోలు చూసేవాడిని. ఇప్పుడు సమయం ఉండటం లేదు. భారత్‌కు ఆడుతున్నప్పుడు, రాణిస్తున్నప్పుడు ఫాలోయింగ్‌ పెరుగుతుంది. అభిమానులతో అనుబంధం కొనసాగించడం అవసరం’ అని యూజీ వెల్లడించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.