close

తాజావార్తలు

పసికూనలపై సఫారీల విజయం

కార్డిఫ్‌: ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా బోణీ కొట్టింది. వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో సఫారీ జట్టు అఫ్గాన్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌ దిగిన అఫ్గాన్‌ 34. 1 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది.  మ్యాచ్‌ ఆరంభంలో వరుణుడు ఆటంకం కలిగించడంతో 48 ఓవర్లకు కుదించి.. లక్ష్యాన్ని 127పరుగులుగా నిర్దేశించారు. అనంతరం 127 పరుగుల లక్షఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 28.4 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి విజయం సాధించింది. దక్షిణాఫ్రికా జట్టులో డికాక్‌(68: 72 బంతుల్లో 8×4) హషీమ్‌ ఆమ్లా(41 నాటౌట్‌: 83 బంతుల్లో 4×4) రాణించారు. సఫారీ బౌలర్లలో తాహీర్‌ నాలుగు, మోరిస్‌ మూడు, ఫెలుక్వాయో రెండు వికెట్లు పడగొట్టారు. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా 5 మ్యాచ్‌లు ఆడగా మూడింట్లో ఓడగా, ఓ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది.
 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.