
తాజావార్తలు
ముంబయి: ప్రపంచకప్‌లో గెలిచే సత్తా ఉన్నప్పటికీ వెస్టిండీస్ మ్యాచుల్ని ఓడిపోతోంది. బంగ్లాదేశ్‌కు నిర్దేశించిన 322 పరుగుల్ని కాపాడుకోలేకపోయింది. ఐదు మ్యాచులాడిన విండీస్ పట్టికలో 3 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ జట్టు ప్రదర్శన చూస్తుంటే బాధేస్తోందని దిగ్గజ క్రికెటర్ కోర్ట్లీ ఆంబ్రోస్ అంటున్నారు. రెండు సార్లు ప్రపంచ విజేతైన జట్టు ఇలా దిగజారిపోవడం చూడలేనని పేర్కొంటున్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
అవును, నిజమే!
అవును, వెస్టిండీస్ ఇబ్బందులు పడటం చూస్తుంటే బాధేస్తుంది. గతంలో చాలా ఏళ్లవరకు అది ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు. నేను బాగా ఆడాను. అత్యుత్తమ జట్టుగా ఉంటే ఎలాగుంటుందో నాకు తెలుసు. కరీబియన్లలో ఇప్పటికీ ప్రతిభ దాగుంది. కావాల్సిందల్లా పద్ధతి ప్రకారం వారిని ప్రోత్సహించడం. ప్రతిభను సానపట్టడం. కొద్దికాలంలోనే వెస్టిండీస్ ప్రపంచ క్రికెట్లోకి మళ్లీ అత్యుత్తమ జట్టుగా దూసుకొస్తుందన్న నమ్మకం ఉంది.
అలాగైతే మజా ఏముంది?
విండీస్ ఇప్పుడు ఆడుతున్న విధానం చూస్తుంటే సెమీస్ చేయడం చాలాచాలా కష్టం. ఇంకా కొన్ని ఓటములు ఎదురవ్వొచ్చు. వాతావరణం సహకరించకపోవచ్చు. అందుకే గెలుస్తూ పోవాలి. చాలా మంది విశ్లేషకులు ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ టాప్ జట్లని చెబుతున్నారు. సెమీస్ చేరతాయని అంచనా వేస్తున్నారు. నేను మాత్రం ఆ జట్లకు కొన్ని అవాంతరాలు ఎదురవుతాయని నిజంగా నమ్ముతున్నా. ప్రపంచకప్ ఆస్తకిగా సాగాలంటే అలా జరగక తప్పదు మరి. ఊహించిన జట్లే సెమీస్ చేరడంలో ఉత్కంఠ ఉండదు. వెస్టిండీస్ నాకౌట్ దశకు చేరుతుందని భావిస్తున్నా.
తీర్చిదిద్దగలరు
కోర్ట్నీ వాల్స్ ఓ దిగ్గజం ఆయనకు చాలా ప్రతిభ ఉంది. భవిష్యత్తులో బంగ్లా బౌలర్లను తీర్చిదిద్దగలరు. వారు నేర్చుకొనేందుకు ఆసక్తి చూపినంత కాలం ఆయన చాలా నేర్పిస్తారు. కోర్ట్నీ అక్కడున్నంత కాలం ఆ కుర్రాళ్లు మెరుగువుతంటారు.
వేగమే ఒక్కటే సరిపోదు
85 మైళ్ల వేగంతోనూ బంతిని స్వింగ్ చేయొచ్చు. వికెట్లు తీయొచ్చు. మంచి ఫాస్ట్‌బౌలర్‌గా ఎదిగేందుకు ప్రాథమిక సూత్రం వేగం మాత్రమే కాదు. బౌలర్‌కు వేగం ఉంటే సాయం చేస్తుంది. బ్యాట్స్‌మెన్ జాగ్రత్తగా ఉంటాడు. భయపడతాడు. అయితే నిలకడగా సరైన ప్రాంతాల్లో చక్కగా బంతులు వేయడమే ప్రాథమిక అంశం. బంతిని భిన్నంగా వేయగలిగితే వికెట్లు లభిస్తాయి.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- శరణార్థులకు పౌరసత్వం
- భాజపాకు తెరాస షాక్!
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- అమ్మ గురుమూర్తీ!