close

తాజావార్తలు

స్టోక్స్‌ అలా అనుకోకపోతే..

చివరి బంతిని స్టేడియం దాటించేవాడు: ఇంగ్లాండ్‌ చీఫ్‌

లండన్‌: ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో ఓవర్‌ త్రో కారణంగా ఇంగ్లాండ్‌కు ఆరు పరగులు కాకుండా ఐదు పరుగులే రావాల్సి ఉందని, ఆ విషయంలో అంపైర్లు తప్పు చేశారని ప్రముఖ అంపైర్‌ సైమన్‌ టోఫెల్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఫీల్డర్‌ బంతి విసరకముందే బ్యాట్స్‌మెన్‌ ఒకరినొకరు దాటితే ఆ పరుగును లెక్కించాలని, కానీ ఇంగ్లాండ్‌ X న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్‌, అదిల్‌ రషీద్‌ రెండో పరుగు తీయకముందే ఫీల్డర్‌ బంతిని విసిరాడని తెలిపారు. అప్పుడు ఐదు పరుగులే లెక్కించి అదిల్‌ రషీద్‌ను బ్యాటింగ్‌ చెయ్యాల్సి ఉండేదని టోఫెల్‌ ఆస్ట్రేలియా మీడియాతో అన్నారు.

ఈ విషయంపై స్పందించాలని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ ఆష్లీగిల్స్‌ను మీడియా కోరగా ఆయన టోఫెల్‌ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ‘మీరొక విషయంపై చర్చించాలి.. ఆఖరి ఓవర్‌లో ట్రెంట్‌బౌల్ట్‌ బౌలింగ్‌ చేస్తుండగా బెన్‌స్టోక్స్‌ చివరి బంతి ఆడేటప్పుడు బంతి లెగ్‌స్టంప్‌ మీద ఫుల్‌టాస్‌ పడింది. ఆ సమయంలో స్టోక్స్‌ రెండు పరుగుల కోసం ఆలోచించకుండా ఉంటే బంతిని స్టేడియం బయటకు పంపేవాడు. మేం ఇప్పుడు ఛాంపియన్లమయ్యాం. కప్పు మాకే వచ్చింది. దాన్ని మాతోనే పెట్టుకుంటాం’ అని వ్యాఖ్యానించాడు. 
 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.