close

తాజావార్తలు

సందడిగా తెలుగుటైటాన్స్‌ పరిచయ కార్యక్రమం

హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలుగు టైటాన్స్‌ జట్టు ట్యాంక్‌బండ్‌పై సందడి చేసింది. ఈనెల 20న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా ప్రో కబడ్డీ లీగ్‌ జరగనుంది. దీంతో తెలుగు టైటాన్స్‌ యాజమాన్యం జట్టు పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో కథానాయకుడు సందీప్‌ కిషన్‌తో పాటు తెలుగు టైటాన్స్‌ జట్టు సభ్యులు పాల్గొన్నారు. బుద్ధుడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రో కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 లోగోను సందీప్‌ కిషన్‌ ఆవిష్కరించారు. ప్రో కబడ్డీ లీగ్‌ లోగోను ఆవిష్కరించడం చాలా సంతోషకరమన్నారు. కబడ్డీ అంటే ఇష్టమని.. టీవీలో వీక్షించేవాడినని తెలిపారు. ఈ లీగ్‌ను ప్రత్యేకంగా ఆస్వాదిస్తానని చెప్పాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.