close

తాజావార్తలు

కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌కు ఆమోదం

యాషెస్‌ సిరీస్‌ నుంచి అధికారికంగా అమల్లోకి..

లండన్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ కీలక సవరణకు ఐసీసీ ఆమోద ముద్ర వేసింది. ఒక క్రికెటర్‌ తలకు బంతి తగిలి ఆడలేని స్థితిలో రిటైర్డ్‌హర్ట్‌ అయినప్పుడు వచ్చే సబ్‌స్టిట్యూట్‌కు బ్యాటింగ్‌, బౌలింగ్‌ కూడా చేసే అవకాశం కల్పిస్తూ ఐసీసీ సవరణ చేసింది. ‘అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని రకాల ఫార్మాట్‌లలో, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌కు అధికారికంగా ఆమోదం లభించింది. ఆటగాళ్ల భర్తీ నిర్ణయం జట్టు వైద్య ప్రతినిధి తీసుకుంటారు. మ్యాచ్‌ రిఫరీ దీనికి ఆమోదం తెలుపుతారు.’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆగస్టు ఒకటి నుంచి ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభం కానున్న యాషెస్‌ సిరీస్‌ నుంచి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ అమల్లోకి వస్తుంది. 

కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ అంటే..
తలకు ఏదైనా బలంగా దెబ్బ తగిలినప్పుడు ఈ కాంకషన్‌ స్థితి వస్తుంది. మెదడు అదరడం, తాత్కాలికంగా స్పృహ కోల్పోవడం, తలతిరిగినట్లు ఉండడం, కాసేపు దృష్టి మందగించడం వంటివి దీని లక్షణాలు. ఫీల్డర్లకు కూడా బంతి తగిలినప్పుడు దాదాపు ఇలాంటి పరిస్థితే. అప్పుడు సదరు ఆటగాడు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగితే అతడి సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డింగ్‌ మాత్రమే చేయగలడు. అయితే ఐసీసీ తాజాగా ఈ నిబంధనకు సవరణ చేయడంతో ఆడలేని స్థితిలో రిటైర్డ్‌హర్ట్‌ అయినప్పుడు వచ్చే సబ్‌స్టిట్యూట్‌కు బ్యాటింగ్‌, బౌలింగ్‌ కూడా చేసే అవకాశం కల్పించడమే కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.