close

తాజావార్తలు

ఐపీఎల్‌ నా జీవితంలో కీలక మలుపు: కృనాల్‌

ముంబయి: భవిష్యత్‌ అవసరాల కోసం టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు సెలక్టర్లు ప్రస్తుతం విశ్రాంతి ఇచ్చారు. వెస్టిండీస్‌ పర్యటనకు అతడిని ఎంపిక చేయలేదు. ఐతే అతడి సోదరుడు కృనాల్‌ పాండ్యకు టీ20 జట్టులో చోటు కల్పించారు. ప్రస్తుతం భారత్‌-ఏ జట్టు తరఫున కరీబియన్‌ దీవుల్లో అదరగొట్టిన సీనియర్‌ పాండ్య జాతీయ జట్టు తరఫున విజయాల్లో కీలకపాత్ర పోషించాలని కోరుకుంటున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ టీవీతో మాట్లాడాడు. ఇప్పటి వరకు అతడు 11 టీ20ల్లో ఆడిన సంగతి తెలిసిందే.

‘ముంబయి ఇండియన్స్‌కు ఆడటం నా జీవితంలో అతిపెద్ద మలుపు. అక్కడే నా ప్రతిభను ప్రదర్శించాను. ఐపీఎల్‌లో అనుభవించే ఒత్తిడి భిన్నంగా ఉంటుంది. టోర్నీలో ఎంతో కష్టపడతాం కాబట్టి ఐపీఎల్‌ విజేతగా నిలిస్తే ఎంతో సంతృప్తి కలుగుతుంది. భారత్‌-ఏ తరఫున పర్యటించడం నాకెంతో ఉపయోగపడింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌లో ఆడాను. సీనియర్‌ జట్టుకు రాక ముందే అక్కడ ఆడి అనుభవం సంపాదించడం ఎప్పుడూ మేలే. ఇప్పుడు వెస్టిండీస్‌ పర్యటన కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ఈ సిరీస్‌ తర్వాత టీమిండియా చాలా క్రికెట్‌ ఆడనుంది. బ్యాటు, బంతితో నిలకడగా రాణించాలని పట్టుదలతో ఉన్నా’ అని కృనాల్‌ పాండ్య వెల్లడించాడు.

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, దిగ్గజ ఆటగాడు ఎంఎస్‌ ధోనీని చూసి ఏం నేర్చుకున్నారన్న ప్రశ్నకు సీనియర్‌ పాండ్య ఇలా సమాధానం ఇచ్చాడు. ‘విరాట్‌ కోహ్లీ నుంచి తీరని దాహం, నిలకడగా ఆడడం నేర్చుకోవాలి. అతడు అన్ని ఫార్మాట్లలో ప్రతి మ్యాచ్‌లో జట్టు కోసం పరుగుల వరద పారిస్తాడు. ఈ ఆటలో మహీ భాయ్‌ అత్యుత్తమ ఫినిషర్‌. ఓపికగా ఉండి జట్టు కోసం మ్యాచ్‌లు ముగించడాన్ని అతడి నుంచి నేర్చుకొంటాను’ అని బదులిచ్చాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌-ఏతో ముగిసిన వన్డే సిరీస్‌లో కృనాల్‌ మెరుగైన ప్రదర్శన చేశాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.