close

తాజావార్తలు

నన్ను ఎంపిక చేయకపోవడంతో నిరాశ చెందా

వెస్టిండీస్‌ టూర్‌ సెలక్షన్‌పై శుభ్‌మన్‌గిల్‌

ముంబయి: వచ్చేనెల వెస్టిండీస్‌ పర్యటన నేపథ్యంలో చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఆదివారం ప్రకటించిన టీమిండియా జట్లలో ఏదైనా ఒకదానిలో తన పేరు ఉంటుందని ఊహించానని ఇండియా ఎ క్రికెటర్‌ శుభ్‌మన్‌గిల్‌ అన్నాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌ సిరీస్‌లో రెండు వన్డేలాడిన శుభ్‌మన్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అతడిని టీమిండియా పక్కనపెట్టింది. ఇటీవల వెస్టిండీస్‌ ఎ జట్టుతో జరిగిన అనధికార ఐదు వన్డేల సిరీస్‌లో రాణించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ సిరీస్‌లో 54.50 సగటుతో మూడు అర్ధశతకాలు సాధించి 218 పరుగులు చేసినా తనను విండీస్‌ పర్యటనకు ఎంపిక చేయకపోవడం నిరాశ కలిగించిందన్నాడు. ఈ విషయంపై చింతించకుండా మరిన్ని పరుగులు చేసి సెలెక్టర్లను ఆకట్టుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. 

ఇదిలా ఉండగా విండీస్‌ పర్యటనకు ఇండియా ఎ జట్టు నుంచి ఏడుగుర్ని ఎంపిక చేసిన సెలక్షన్‌ కమిటీ శుభ్‌మన్‌ను అవకాశమివ్వలేదు. మనీష్‌పాండే, శ్రేయస్‌ అయ్యర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఖలీల్‌అహ్మద్‌, నవదీప్‌ సైనీ, దీపక్‌ చాహర్‌, రాహుల్‌ చాహర్‌లను పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలోనే శుభ్‌మన్‌ను ఎంపికచేయకపోవడంపై కొందరు అభిమానులు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేశారు. 

శుభ్‌మన్‌గిల్‌ని ఎంపిక చేయకపోవడంపై చీఫ్‌ సెలెక్టర్‌ ప్రసాద్‌ ఆదివారం మాట్లాడుతూ వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం అతడు వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నాడని, తప్పకుండా భవిష్యత్‌లో అవకాశాలిస్తామని చెప్పాడు. విండీస్‌ ఎ జట్టుపై మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లని సీనియర్‌ జట్టులోకి తీసుకొని వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చామని, ఈ సిరీస్‌లో మనీష్‌పాండే, శ్రేయస్‌ అయ్యర్‌, నవదీప్‌సైనీ తమ ఆటతో ఆకట్టుకున్నారని ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.