close

తాజావార్తలు

యువరాజ్‌ రికార్డుపై కన్నేసిన హిట్‌మ్యాన్

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్: భారత మాజీ ఆల్‌రౌండర్‌, సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్‌ సాధించిన రికార్డుకు టీమిండియా వైస్‌కెప్టెన్ రోహిత్‌ శర్మ అతి చేరువలో ఉన్నాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా యువరాజ్‌ ఏడో స్థానంలో ఉన్నాడు. రోహిత్‌ శర్మ ఈ స్థానానికి చేరుకోవడానికి మరో 26 పరుగులే అవసరం. యువరాజ్ 304 వన్డేల్లో 8701 పరుగులు చేయగా హిట్‌మ్యాన్ 217 మ్యాచుల్లో 8676 పరుగులు చేశాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో రోహిత్‌ రికార్డు స్థాయిలో ఐదు శతకాలతో 648 పరుగులు బాదాడు. కానీ వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో నిరాశపరిచాడు. 34 బంతుల్లో 18 పరుగులే చేసి పెవిలియన్‌కు చేరాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనగా రోహిత్‌ కాస్త తడబడ్డాడు. మూడో వన్డేలో హిట్‌మ్యాన్‌ తనదైన శైలిలో రాణించాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు: సచిన్‌ తెందుల్కర్‌ (18426), విరాట్ కోహ్లీ (11406), సౌరభ్‌ గంగూలీ (11363), రాహుల్‌ ద్రవిడ్‌ (10889), ఎంఎస్ ధోనీ (10773), మహ్మద్‌ అజారుద్దీన్‌ (9378), యువరాజ్‌ సింగ్ (8701), రోహిత్‌ శర్మ (8676).

మరో రికార్డుకు చేరువలో కోహ్లీ: 
భారత్‌xవెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ శతకం సాధించి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. భారత్‌, వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగులు బాదిన ఆటగాడిగా నిలవడానికి రికార్డుల రారాజు మరో 25 పరుగులు చేయాలి. ప్రస్తుతం ఈ రికార్డు విండీస్‌ బ్యాట్స్‌మన్ రామ్‌నరేశ్ (700) పేరిట ఉంది. కోహ్లీ వెస్టిండీస్‌పై 14 మ్యాచుల్లో 61.45 సగటుతో 676 పరుగులు చేశాడు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో నేడు విండీస్‌తో భారత్‌ ఆఖరి వన్డే ఆడనుంది. తొలి వన్డే వర్షార్పరణం కాగా రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.