Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 141969
            [news_title_telugu_html] => 

కోహ్లీసేన మేనేజర్‌పై వేటు!

[news_title_telugu] => కోహ్లీసేన మేనేజర్‌పై వేటు! [news_title_english] => Team India manager called back from West Indies [news_short_description] => అమర్యాదగా ప్రవర్తించిన కారణంగా టీమిండియా మేనేజర్‌ సునిల్‌ సుబ్రమణ్యంపై వేటు పడింది! వెస్టిండీస్‌ పర్యటన నుంచి ఆయన్ను మధ్యలోనే వెనక్కి పిలిపిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఎలాంటి పదవులు చేపట్టకుండా నిషేధించే యోచనలో బీసీసీఐ.... [news_tags_keywords] => Team India manage,INDvsWI,sunil subramaniam,bcci [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-15 00:23:37 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కోహ్లీసేన మేనేజర్‌పై వేటు! - Team India manager called back from West Indies - EENADU
close

తాజావార్తలు

కోహ్లీసేన మేనేజర్‌పై వేటు!

ముంబయి: అమర్యాదగా ప్రవర్తించిన కారణంగా టీమిండియా మేనేజర్‌ సునిల్‌ సుబ్రమణ్యంపై వేటు పడింది! వెస్టిండీస్‌ పర్యటన నుంచి ఆయన్ను మధ్యలోనే వెనక్కి పిలిపిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఎలాంటి పదవులు చేపట్టకుండా నిషేధించే యోచనలో బీసీసీఐ కనిపిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జల సంరక్షణపై క్రికెటర్లతో ఓ వీడియో చిత్రీకరించేందుకు సహకరించాలని కరీబియన్‌ దీవుల్లోని భారత హైకమిషన్‌ అధికారులు సుబ్రమణ్యాన్ని కోరారు. ‘నన్ను సందేశాలతో ముంచెత్తకండి’ అంటూ వారితో ఆయన అమర్యాదగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని దిల్లీకి చేరవేయడంతో క్రికెట్‌ పాలకుల కమిటీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కఠినంగా హెచ్చరించింది. ఇప్పుడు భారత్‌కు పిలిపిస్తోంది.

గతంలోనూ సునిల్‌ సుబ్రమణ్యం ఇతర దేశాల్లోని క్రికెట్‌ బోర్డు అధికారులతో అమర్యాదగా ప్రవర్తించిన దాఖలాలు ఉన్నాయి. అప్పుడాయన సులువుగా వేటు నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు హైకమిషన్‌ అధికారులు కావడంతో చర్యలు తీసుకోక తప్పడం లేదు. సీఓఏ అధినేత వినోద్‌ రాయ్‌పై పైనుంచి ఒత్తిడి మొదలైంది. 2018, డిసెంబర్‌లో కోహ్లీసేన ఆస్ట్రేలియాలో పర్యటించింది. పెర్త్‌ టెస్టు సమయంలో అక్కడి క్యాటరింగ్‌ సిబ్బంది, క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆపరేషన్స్‌ మేనేజర్‌ ఆమ్‌ ఫ్రాసెర్‌ను తన ప్రవర్తనతో సుబ్రమణ్యం ఇబ్బంది పెట్టారు. ఆసీస్‌లో చారిత్రక విజయం సాధించిన టీమిండియా సంబరాలు చేసుకొనేందుకు బీసీసీఐ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ వేడుకలో మిగిలిపోయిన వస్తువులను వ్యక్తిగత అవసరాల కోసం ఆయన తీసుకెళ్లారు. ప్రపంచకప్‌ సమయంలోనూ బోర్డు అధికారులతో దురుసుగా ప్రవర్తించారని తెలిసింది. తన స్నేహితులు, బంధువులకు మ్యాచ్‌ టికెట్లు ఇవ్వడమే లక్ష్యంగా ఉండేవారని, అసలు పని పక్కన పెట్టేసేవారని బోర్డు అధికారులు అంటున్నారు. క్రికెట్‌ పాలకుల కమిటీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.