Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143502
            [news_title_telugu_html] => 

లేహ్‌ నుంచి ధోనీ తిరుగుప్రయాణం

[news_title_telugu] => లేహ్‌ నుంచి ధోనీ తిరుగుప్రయాణం [news_title_english] => MS Dhoni completes 15-day Army stint spotted at Leh airport [news_short_description] => సైనిక విధుల్లో పాల్గొనడానికి టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యారాచ్యూట్‌ [news_tags_keywords] => MS Dhoni,Leh airport,Cricket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 00:20:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
లేహ్‌ నుంచి ధోనీ తిరుగుప్రయాణం - MS Dhoni completes 15-day Army stint spotted at Leh airport - EENADU
close

తాజావార్తలు

లేహ్‌ నుంచి ధోనీ తిరుగుప్రయాణం

దిల్లీ: సైనిక విధుల్లో పాల్గొనడానికి టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యారాచ్యూట్‌ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్‌ హోదాలో ఉన్న ధోనీ కశ్మీర్‌ లోయలో రెండు వారాల పాటు తన విధులను నిర్వర్తించాడు.  ధోనీ తాత్కాలిక సైనిక విధులు గురువారంతోనే ముగిశాయి. దీంతో లేహ్‌ విమానశ్రయం నుంచి అతడు దిల్లీకి బయలుదేరాడు. తొలుత దిల్లీకి చేరుకొని అక్కడి నుంచి అతడి స్వస్థలం రాంచీకి బయలుదేరనున్నట్లు సమాచారం. లేహ్‌ విమానాశ్రయంలో ఉన్న ధోనీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. స్వాత్రంత్యం దినోత్సవ వేడుకలను ధోనీ లద్దాఖ్‌లో జరుపుకొన్నాడు. అక్కడి సైనిక ఆసుపత్రిలో జవానులతో గడిపాడు. ఆ తర్వాత సియాచిన్‌కు చేరుకొని యుద్ధ వీరులకు నివాళి అర్పించాడు. ఆర్మీతో కలిసి పనిచేసేందుకు ధోనీ వెస్టిండీస్‌ టూర్‌కు దూరమైన విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్‌ 15 నుంచి స్వదేశంలో జరగనున్న దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రిటైర్మెంట్ గురించి ధోనీ ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో అతడికి ఆఖరి సిరీస్‌ దక్షిణాఫ్రికాతోనే కావొచ్చని అందరూ భావిస్తున్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.