Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145584
            [news_title_telugu_html] => 

ఆటలో స్ట్రోక్‌ ప్లేయర్‌.. అమ్మాయిల రాక్‌ స్టార్‌

[news_title_telugu] => ఆటలో స్ట్రోక్‌ ప్లేయర్‌.. అమ్మాయిల రాక్‌ స్టార్‌ [news_title_english] => Are they all KL Rahul girl friends [news_short_description] => భారత యువ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్ ఆటతోనే కాకుండా ఆటేతర విషయాలతోనూ తరుచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 00:35:44 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆటలో స్ట్రోక్‌ ప్లేయర్‌.. అమ్మాయిల రాక్‌ స్టార్‌ - Are they all KL Rahul girl friends - EENADU
close

తాజావార్తలు

ఆటలో స్ట్రోక్‌ ప్లేయర్‌.. అమ్మాయిల రాక్‌ స్టార్‌

భారత యువ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్ ఆటతోనే కాకుండా ఆటేతర విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఇటీవల ఆకాంక్ష రంజన్‌ కపూర్‌ అనే అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్టైలిష్ బ్యాట్స్‌మన్‌పై ఇలాంటి పుకార్లు వినిపించడం కొత్తేమీ కాదు. మైదానంలో బ్యాట్‌తో.. బయట తన స్టైల్‌తో అమ్మాయిల గుండెల్లో స్వీట్ స్ట్రోక్‌ ఇస్తున్నాడు. గతంలోనూ బాలీవుడ్‌ భామలతో, మోడల్స్‌తో పీకల్లోతు ప్రేమల్లో ఉన్నట్టు గుసగుసలు వినిపించాయి. అతడి ప్రేమాయణంలో భారీ జాబితానే ఉంది. మోడల్ ఎలిక్సర్‌ నహర్‌, కథానాయికలు సోనమ్‌ బజ్వా, ఆతియా శెట్టి, నిధి అగర్వాల్‌తో వేర్వేరు సందర్భాల్లో ప్రేమలో మునిగినట్లు విన్నాం. ఇంతకూ ఈ స్ట్రోక్‌ ప్లేయర్‌ హృదయాన్ని ఎవరైనా గెలుచుకున్నారో లేదో! ఒకసారి ఆ అతివల గురించి లుక్కేద్దామా!!

అందాల నహర్‌

ఎలిక్సిర్‌ నహర్‌ స్వస్థలం బెంగళూరు. ఆమె యాంకర్‌, మోడల్, మార్కెటింగ్‌ అసోసియేట్‌. గతంలో రాహుల్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరు కలిసి షికారుకు వెళ్లినప్పుడు కెమెరా కంటికి ఎన్నో సార్లు చిక్కారు. భారత్‌ తరఫున రాహుల్‌ ఆడుతున్నప్పుడు అతడి కోసం స్టేడియానికి వచ్చింది. ప్రస్తుతం ఆమె కేపీఎల్‌ టీవీ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ముద్దుగుమ్మ ఎంతో చురుకు. ఓ సారి ఈ సొగసరి సోయగాల చిత్రాలు వీక్షించండి.

అతిశయాల సోయగం
బాలీవుడ్‌ హీరో సునిల్‌ శెట్టి గారాల తనయ ఆతియా శెట్టి. ‘హీరో’ చిత్రంతో అందరికీ పరిచయమైంది. దాదాసాహెబ్‌ ఫాల్కే ఎక్సెలెన్స్‌ అవార్డుల్లో ఉత్తమ తెరంగేట్రం నాయికగా పురస్కారం అందుకుంది. ఆ తర్వాత ‘ముబారక్‌’ సినిమాలో మురిపించింది. ‘నవాబ్‌ జాదే’లో అతిథిగా అలరించింది. ప్రస్తుతం ‘మోతీచూర్‌ చక్నాచూర్‌’  చిత్రంలో నటిస్తోంది. స్ట్రోక్‌ప్లేయర్‌ రాహుల్‌తో కొన్నాళ్లు ప్రేమాయణం కొనసాగించిందని గుసగుసలు వినిపించిన ఆతియా శెట్టి చిత్రాలు చూసేయండి. 

సోనమ్‌ ‘బంగారం’
సుశాంత్‌ హీరోగా నటించిన ‘ఆటాడుకుందాం రా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తార సోనమ్‌ బజ్వా. మోడలింగ్‌లోనూ అనుభవం ఉంది. ఆమె ఉత్తరాఖండ్‌లో జన్మించారు. పంజాబీ, హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. ‘పంజాబీ 1984’లో చక్కని అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది. విక్టరీ వెంకటేశ్‌ నటించిన ‘బాబు బంగారం’ సినిమాలో ప్రత్యేక గీతంలో నర్తించి ఊపు ఊపేసింది. ప్రస్తుతం పంజాబీలో సింగం, తమిళంలో కాటెర్రి చిత్రాల్లో నటిస్తోంది. రాహుల్‌తో అనుబంధం ఎలా మొదలైందో తెలీదుగానీ కొన్నాళ్లు వీరిద్దరూ చెట్టాపట్టాల్‌ వేసుకున్నారు.

హాట్‌.. హాట్‌  నిధి
ఓ లుక్కేస్తే చాలు కళ్లు జిగేలుమనే అందం నిధి అగర్వాల్ సొంతం. 2017లో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది. బాలీవుడ్‌, టాలీవుడ్‌లో కథానాయికగా రాణిస్తోంది. సవ్యసాచితో టాలీవుడ్‌లో అరంగ్రేటం చేసిన నిధి మిస్టర్‌ మజ్నులో అఖిల్‌ పక్కన ఇరగదీసింది. ఇక ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంలో హాట్‌హాట్‌గా నటించి కుర్రాళ్ల మనసును దోచేసింది. ప్రస్తుతం ‘మాస్క్’ అనే హిందీ సినిమాలో నటిస్తోంది. రాహుల్‌తో నిధి డేటింగ్‌ చేసిందని గతంలో వార్తలు వినిపించాయి. కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌ అయ్యాయి. 

ఆహా.. ఆకాంక్ష
పంజాబీ మోడల్, నటి ఆకాంక్ష రంజన్‌ కపూర్‌తో కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం డేటింగ్‌ చేస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిద్దరు కలిసి చనువుగా దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్‌ ప్రముఖ కథానాయిక ఆలియా భట్‌ స్నేహితురాలుగా ఆకాంక్షకు నెట్టింట్లో మంచి క్రేజ్‌ ఉంది. ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌కు రాహుల్‌ను ఆమె స్వయంగా పరిచయం చేయడంతో ప్రేమ వార్తలకు రెక్కలొచ్చాయి. ఇంతకూ ఆకాంక్షను ప్రేమిస్తున్నారా అని అడిగితే విరగబడి నవ్విన రాహుల్‌ ఏమన్నాడో తెలుసా? తనకేం తెలియదని చెప్పాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.