Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145676
            [news_title_telugu_html] => 

ప్రిక్వార్టర్స్‌కు సింధు

[news_title_telugu] => ప్రిక్వార్టర్స్‌కు సింధు [news_title_english] => Sindhu makes positive start at World Championships [news_short_description] => భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ప్రిక్వార్టర్స్‌ చేరుకుంది. బై లభించడంతో నేరుగా రెండో రౌండ్లో ప్రవేశించిన ఆమె చైనీస్‌ తైపీ అమ్మాయి పై యు పోను 21-14, 21-14 తేడాతో చిత్తుగా...... [news_tags_keywords] => BWF World Championships,P V Sindhu,Pai Yu Po,Beiwen Zhang [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 21:15:21 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రిక్వార్టర్స్‌కు సింధు - Sindhu makes positive start at World Championships - EENADU
close

తాజావార్తలు

ప్రిక్వార్టర్స్‌కు సింధు

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ప్రిక్వార్టర్స్‌ చేరుకుంది. బై లభించడంతో నేరుగా రెండో రౌండ్లో ప్రవేశించిన ఆమె చైనీస్‌ తైపీ అమ్మాయి పై యు పోను 21-14, 21-14 తేడాతో చిత్తుగా ఓడించింది. ప్రి క్వార్టర్స్‌లో ఆమె బీవెన్‌ ఝంగ్‌ (అమెరికా)తో తలపడనుంది. గతేడాది ఇండియా ఓపెన్‌ ఫైనల్లో సింధును ఓడించిన అనుభవం ఝంగ్‌కు ఉంది.

మ్యాచ్‌లో సింధు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. కోర్టులో చురుగ్గా కదిలింది. తొలిగేమ్‌లో స్కోరు 5-5తో ఉన్నప్పుడు చెలరేగిన సింధు విరామ సమయానికి 11-7తో ఆధిక్యంలోకి వచ్చేసింది. అదే ఊపులో వరుసగా ఆరు పాయింట్లు సాధించింది. మ్యాచ్‌ పాయింట్‌ వద్ద పై పొరపాటు చేయడంతో క్రాస్‌కోర్ట్‌ షాట్‌తో సింధు తొలి గేమ్‌ గెలిచింది. ఇక రెండో గేమ్‌లోనూ ఆమె 6-1తో దూసుకుపోయింది. ఈ క్రమంలో ర్యాలీ గేమ్‌ ఆడిన పై స్కోరును 5-7కు తగ్గించింది. సింధు అనవసర తప్పిదాలు చేయడంతో విరామ సమయానికి తైపీ అమ్మాయి 11-10తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత గేరు మార్చిన తెలుగమ్మాయి 20-14తో గేమ్‌ పాయింట్‌కు చేరువైంది. బ్యాక్‌లైన్‌ షాట్‌తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్‌లో జక్కంపూడి మేఘన, పూర్వీషా ఎస్‌ రామ్‌ జోడీ 8-21, 18-21 తేడాతో జపాన్‌ జంట షిహో తనక, కొహరు యోనెమోటొ చేతిలో ఓటమి పాలైంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.