Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000777
            [news_title_telugu_html] => 

భారీ ఆధిక్యం దిశగా భారత్‌

[news_title_telugu] => భారీ ఆధిక్యం దిశగా భారత్‌ [news_title_english] => India lead by 260 runs [news_short_description] => వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత్‌ భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. మూడో రోజు ఆట ముగిసే... [news_tags_keywords] => IND VS WI,kohli,rahane,holder,cricket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 02:17:40 [news_isactive] => 1 [news_status] => 2 ) )
భారీ ఆధిక్యం దిశగా భారత్‌ - India lead by 260 runs - EENADU
close

తాజావార్తలు

భారీ ఆధిక్యం దిశగా భారత్‌

తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 222కే ఆలౌట్‌
మూడో రోజు ఆటలో భారత్‌ 185/3
ఆంటిగ్వా

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో కోహ్లీసేన భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. ఇషాంత్‌శర్మ (5/43), షమి(2/48), జడేజా(2/64) విజృంభించడంతో విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్‌ చేసి భారత్‌ 75 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 72 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. సారథి విరాట్‌ కోహ్లీ(51 బ్యాటింగ్‌), అజింక్య రహానె(53 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. చేతిలో 7 వికెట్లు ఉన్న టీమిండియా.. ప్రస్తుతానికి 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 

మయాంక్‌ తక్కువ పరుగులకే..
ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (16) రెండో ఇన్నింగ్‌లోనూ తక్కువ పరుగులకే ఔట్ అయ్యాడు. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన అతను చేజ్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (38; 85 బంతుల్లో 4×4), పుజారా (25; 53 బంతుల్లో 1×4)తో కలిసి చక్కటి ఇన్నింగ్స్‌ ఆడాడు. విండీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న వీరిద్దరూ గొప్ప పట్టుదలతో పోరాటం సాగించారు. కానీ ఈ జోడీని చేజ్‌ విడదీశాడు. 30వ ఓవర్‌లో చక్కటి బంతితో రాహుల్‌ను బౌల్డ్‌ చేశాడు. కాసేపటికే పుజారాను రోచ్‌ బోల్తా కొట్టించాడు. అప్పటికి స్కోరు 81/3.

కోహ్లీ-రహానె శతక భాగస్వామ్యం..
మూడో రోజు ఆటలో కోహ్లీ- రహానె జోడీ ప్రదర్శన ఆకట్టుకుంది. స్వల్ప పరుగుల వ్యవధిలో వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన భారత్‌ ఇన్నింగ్‌ను వీరిద్దరూ చక్కదిద్దారు. విండీస్‌ బౌలర్లను ఆచితూచి ఎదుర్కొంటూ చక్కటి సమన్వయంతో ముందుకు సాగారు. 68వ ఓవర్‌లో రహానె అర్ధశతకం అందుకోగా.. 71వ ఓవర్‌లో కోహ్లీ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే శతక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మూడో రోజు ఆటలో అజేయంగా నిలిచారు. విండీస్‌ బౌలర్లలో రోచ్‌ వైవిధ్యమైన బంతులు విసిరి ఆకట్టుకున్నాడు. 

మరో 33 పరుగులు జోడించి.. వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌లో ఇషాంత్‌ బౌలింగే హైలైట్‌. రెండో రోజు విండీస్‌ 189/8కి పరిమితం అయిందంటే కారణం లంబూనే. పదునైన పేస్‌ బౌలింగ్‌తో విండీస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఇషాంత్‌ క్రమం తప్పకుండా వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. కాగా మూడో రోజు ఉదయం ఆట మొదలుపెట్టిన విండీస్‌ మరో 33 పరుగులు జోడించి ఆలౌటైంది. కమిన్స్‌ (43 బంతుల్లో 0) అండతో హోల్డర్‌(39) పోరాడాడు. ఈ జోడీ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో షమి అద్భుత బంతితో హోల్డర్‌ను ఔట్‌ చేశాడు. కమిన్స్‌ను జడేజా బౌల్డ్‌ చేయడంతో విండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.