Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009216
            [news_title_telugu_html] => 

43 ఏళ్ల రికార్డు వేటలో స్మిత్‌..!

[news_title_telugu] => 43 ఏళ్ల రికార్డు వేటలో స్మిత్‌..! [news_title_english] => Steve Smith on verge of breaking 43-year-old record in Test cricket [news_short_description] => ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఒకే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ దిగ్గజం [news_tags_keywords] => Ashes 2019,Steve Smith, Viv Richards,Records [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 11:50:22 [news_isactive] => 1 [news_status] => 2 ) )
43 ఏళ్ల రికార్డు వేటలో స్మిత్‌..! - Steve Smith on verge of breaking 43-year-old record in Test cricket - EENADU
close

తాజావార్తలు

43 ఏళ్ల రికార్డు వేటలో స్మిత్‌..!

లండన్: ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌స్మిత్‌ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఒకే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ దిగ్గజం వివ్‌రిచర్డ్స్‌ రికార్డు సృష్టించాడు. 1976లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతడు 829 పరుగులతో రికార్డు నెలకొల్పాడు. అనారోగ్య కారణంతో ఐదు టెస్టుల సిరీస్‌లో రిచర్డ్స్‌ నాలుగు మ్యాచులు మాత్రమే ఆడాడు. ఈ జాబితాలో భారత ఆటగాడు సునిల్‌ గవాస్కర్‌ 774 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. గవాస్కర్ తర్వాతి స్థానాల్లో గ్రాహమ్‌ గూచ్‌ (752), బ్రియన్‌ లారా (688) ఉన్నారు.

రిచర్డ్స్‌ పేరిట ఉన్న 43 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టడానికి స్మిత్‌కు మరో 159 పరుగులు అవసరం. బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురైన స్మిత్‌ యాషెష్‌ సిరీస్‌తో టెస్టు క్రికెట్‌లో తిరిగి అడుగుపెట్టాడు. పునరాగమనం తర్వాత అతడు అద్వితీయమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో మూడు మ్యాచులు ఆడిన అతడు 134.20 సగటుతో 671 పరుగులు చేశాడు. నాలుగో టెస్టులో ద్విశతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్న అతడు కోహ్లీని అధిగమించి 937 రేటింగ్‌ పాయింట్లతో టెస్టుల్లో తొలిర్యాంకును దక్కించుకొన్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై ఆసీస్‌ 2-1తో పైచేయి సాధించింది. సెప్టెంబర్‌ 12 నుంచి చివరి టెస్టు ప్రారంభం కానుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.