
తాజావార్తలు
ముంబయి: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తన అభిమానులకు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మధ్యే కేరళలో ఓ అభిమానిని కలుసుకొన్న సంఘటనను గుర్తు చేసుకున్నారు. కాలి వేళ్లతో చిత్రాలు గీసే చిత్రాకారుడు అతడు. ‘అందరికీ ఓనం శుభాకాంక్షలు. ఈ వేడుక మీ అందరికీ ఆనందం, సౌభాగ్యం అందించాలని కోరుకుంటున్నాను. కాలి వేళ్లతో చిత్రాలు గీసే ప్రణవ్ను ఈ మధ్యే కలుసుకున్నాను. అతడి ప్రేరణ, స్ఫూర్తికి పరవశించాను. నా వరకు అసలైన కేరళ స్ఫూర్తికి ఇది ప్రతిబింబం’ అని సచిన్ ట్వీట్ చేశాడు. ఆయనతో పాటు టీమిండియా క్రికెటర్లు అజింక్య రహానె, సురేశ్ రైనా సైతం అభిమానులకు ఓనం శుభాకాంక్షలు తెలియజేశారు.
సచిన్ ఈ మధ్యే బాలీవుడ్ కథానాయకులు వరుణ్ ధావన్, అభిషేక్ బచ్చన్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడి అలరించాడు. ఇక వెస్టిండీస్ సిరీస్‌లో అజింక్య రహానె అద్భుతంగా ఆడాడు. రెండేళ్ల తర్వాత శతకం సాధించాడు. సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. హనుమ విహారి తర్వాత అత్యధిక పరుగులు సాధించింది అతడే.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- ఆంగ్లమాధ్యమంపై సంవాదం