Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009739
            [news_title_telugu_html] => గృహహింస కేసులో యువరాజ్‌కు భారీ ఊరట
            [news_title_telugu] => గృహహింస కేసులో యువరాజ్‌కు భారీ ఊరట
            [news_title_english] => Yuvraj can heal now says family after domestic violence case closed against cricketer
            [news_short_description] => టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌సింగ్‌కు గృహహింస కేసులో ఊరట లభించింది. అతడిపై చేసిన ఆరోపణలు, ఫిర్యాదులన్నీ అవాస్తవాలని కేసు పెట్టిన ఆకాంక్ష శర్మ అంగీకరించిందని యువీ కుటుంబ సభ్యులు వెల్లడించారు.....

            [news_tags_keywords] => domestic violence,Yuvraj Singh,Zoraver singh,Akanksha Sharma
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-09-12 13:17:46
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
గృహహింస కేసులో యువరాజ్‌కు భారీ ఊరట - Yuvraj can heal now says family after domestic violence case closed against cricketer - EENADU
close

తాజావార్తలు

గృహహింస కేసులో యువరాజ్‌కు భారీ ఊరట

దిల్లీ: టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌సింగ్‌కు గృహహింస కేసులో ఊరట లభించింది. అతడిపై చేసిన ఆరోపణలు, ఫిర్యాదులన్నీ అవాస్తవాలని కేసు పెట్టిన ఆకాంక్ష శర్మ అంగీకరించిందని యువీ కుటుంబ సభ్యులు వెల్లడించారు. దేశంలో కోట్లాది మంది ప్రేమించే యువీ పేరును దురుద్దేశ పూర్వకంగానే కేసులోకి లాగారని పేర్కొన్నారు. ఇప్పుడు అతడు ప్రశాంతంగా ఉండగలడని తెలిపారు.

యువీ సోదరుడు జొరావర్‌ సింగ్‌ సతీమణి ఆకాంక్ష సింగ్‌. పెళ్లైన ఆర్నెల్లకే వీరిద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలో భర్త సహా యువీ, అతడి తల్లి షబ్నమ్‌పై ఆకాంక్ష 2017, అక్టోబర్‌లో గృహహింస కేసు పెట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ మొదటి వారంలో వీరిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.

‘చట్టం నుంచి తప్పించుకోలేనని తెలుసుకున్న మిస్‌ ఆకాంక్ష సింగ్‌ తాను చేసిన ఆరోపణలు, ఫిర్యాదులు అవాస్తవమని అంగీకరించింది. వాటిని ఉపసంహరించుకుంది. ఈ దేశంలో యువరాజ్‌ సింగ్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అతడి పేరును అడ్డంపెట్టుకొని మా కుటుంబ సభ్యులను లక్ష్యంగా ఎంచుకుంది. గృహహింస కేసుతో యువీ ప్రతిష్ఠకు భంగం కలిగించింది. అన్యాయ ప్రయోజనం (అన్‌ఫెయిర్‌ అడ్వాంటేజ్‌) పొందాలని చూసింది. యువీని చూసి మేం గర్విస్తున్నాం. దేవుడిపై నమ్మకంతో అతడు చట్టం, న్యాయవ్యవస్థపై పోరాడాడు’ అని యువీ కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.