Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009744
            [news_title_telugu_html] => 

గతం గతః సరికొత్తగా మొదలుపెడతా: పంత్‌

[news_title_telugu] => గతం గతః సరికొత్తగా మొదలుపెడతా: పంత్‌ [news_title_english] => Pant says aiming for fresh start with South Africa series [news_short_description] => దక్షిణాఫ్రికా సిరీస్‌ను సరికొత్త దృక్పథంతో ఆరంభిస్తానని టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ అన్నాడు. ఈ సిరీస్‌ కోసం కఠినంగా సాధన చేశానని వెల్లడించాడు. వెస్టిండీస్‌ పర్యటనలో అంచనాల మేరకు రాణించకపోవడంతో.... [news_tags_keywords] => South Africa series,Rishabh Pant,INDvsSA [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 14:32:11 [news_isactive] => 1 [news_status] => 2 ) )
గతం గతః సరికొత్తగా మొదలుపెడతా: పంత్‌ - Pant says aiming for fresh start with South Africa series - EENADU
close

తాజావార్తలు

గతం గతః సరికొత్తగా మొదలుపెడతా: పంత్‌

కోల్‌కతా: దక్షిణాఫ్రికా సిరీస్‌ను సరికొత్త దృక్పథంతో ఆరంభిస్తానని టీమిండియా యువవికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ అన్నాడు. ఈ సిరీస్‌ కోసం కఠినంగా సాధన చేశానని వెల్లడించాడు. వెస్టిండీస్‌ పర్యటనలో అంచనాల మేరకు రాణించకపోవడంతో అతడిపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలో శతకాలు చేసిన భారత మొదటి కీపర్‌గా రికార్డులు సృష్టించిన పంత్‌ విండీస్‌పై రెండు టెస్టుల్లో కలిపి 58 పరుగులే చేశాడు. టీ20ల్లో చెత్త షాట్లకు ఔటయ్యాడు.

‘దక్షిణాఫ్రికా సిరీస్‌ కోసం కఠినంగా శ్రమించాను. సానుకూల దృక్పథంతో ముందుకెళ్తాను. సాధ్యమైనంత మేరకు శుభారంభం చేస్తాను. విండీస్‌లో జట్టు అద్భుతంగా రాణించింది. అన్ని సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేసి రావడం గొప్ప విషయం. ఒక్కసారి జట్టు అక్కడ్నుంచి తిరిగొచ్చాక గతం గతః అన్నట్టే. తర్వాతి సిరీస్‌పై దృష్టిపెడతారు. ఇప్పుడు సొంతగడ్డపై ఆడుతున్నాం కాబట్టి కొంత అనుకూలత ఉంటుంది. ఏదేమైనప్పటికీ శుభారంభం చేయడం కీలకం. టీమిండియా గెలుపునకు సాయపడాలని నేను కోరుకుంటాను. సఫారీలపై రాణించడమే నా ముందున్న లక్ష్యం. ఆ తర్వాత బంగ్లాదేశ్. ధోనీని నేనెంతో ప్రేమిస్తాను. ఇతరులు మమ్మల్ని పోల్చడాన్ని పట్టించుకోను. మరింత మెరుగవ్వడం, చక్కగా ఆడటంపై దృష్టిసారిస్తాను’ అని పంత్‌ అన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.