close

తాజావార్తలు

గవాస్కర్‌తో సమానంగా స్టీవ్‌స్మిత్‌

నాలుగు టెస్టుల్లో రికార్డు పరుగులు

లండన్‌: దక్షిణాఫ్రికాలో బాల్‌ టాంపరింగ్‌ వివాదం కారణంగా గతేడాది సంవత్సరం పాటు నిషేధానికి గురైన ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ ఆదివారం పూర్తయిన యాషెస్‌ సిరీస్‌లో అదరగొట్టాడు. నాలుగు మ్యాచ్‌ల్లోనే 774 పరుగులు చేసి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. మోసగాడు అంటూ అవమానించిన ఇంగ్లాండ్‌ అభిమానులతోనే ఐదో టెస్టు సందర్భంగా శభాష్‌ అనిపించుకున్నాడు. ఆదివారం స్టువర్ట్‌బ్రాడ్‌ బౌలింగ్‌లో స్మిత్‌(23) ఔటవ్వగానే స్టేడియంలోని అభిమానులు లేచి నిలబడి అతడికి చప్పట్లు కొట్టారు. దీన్నిబట్టే ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ ఈ సిరీస్‌లో ఎలా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అతడు పలు రికార్డులు చేరుకున్నాడు.

21వ శతాబ్దంలో ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా స్టీవ్‌స్మిత్‌ కొత్త రికార్డు సృష్టించాడు. అలాగే భారత లెజెండరీ బ్యాట్స్‌మన్‌ సునీల్‌గవాస్కర్‌ సరసన నిలిచాడు. 1971లో గవాస్కర్‌ అరంగేట్ర విండీస్‌ పర్యటనలో తొలి టెస్టు ఆడే అవకాశం రాకపోయినా తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించాడు. ఆ పర్యటనలో సన్నీ 774 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ నేపథ్యంలో అప్పటి గవాస్కర్‌ రికార్డును స్మిత్‌ ఇప్పుడు సమం చేశాడు. మరోవైపు 25 ఏళ్ల తర్వాత ఒక టెస్టు సిరీస్‌లో 770కి పైగా పరుగులు సాధించడం ఇదే తొలిసారి. 1994లో బ్రియన్‌ లారా 778 పరుగులు చేశాడు. అతడి తర్వాత స్మిత్‌ 774 పరుగులు చేశాడు.

ఇదిలాఉండగా ఆదివారం తక్కువ పరుగులకే ఔటైన ఈ మాజీ కెప్టెన్‌.. టెస్టుల్లో ఓ అరుదైన రికార్డును కోల్పోయాడు. 1976 ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా విండీస్‌ దిగ్గజం వీవ్‌రిచర్డ్స్‌ నాలుగు మ్యాచ్‌ల్లోనే అత్యధిక పరుగులు 829 సాధించాడు. అప్పటి నుంచి ఈ రికార్డు పదిలంగా ఉంది. విచిత్రమేంటంటే ఆ సిరీస్‌లో రిచర్డ్స్‌ అనారోగ్యంతో ఓ మ్యాచ్‌ ఆడలేదు. ప్రస్తుత సిరీస్‌లోనూ స్మిత్‌ గాయం కారణంగా ఒక మ్యాచ్‌ ఆడలేదు. మరోవైపు స్టీవ్‌స్మిత్‌ తన పేరిట ఉన్న మరో రికార్డును తానే అధిగమించాడు. 2014-15 బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ సందర్భంగా టీమిండియాపై చెలరేగిన అతడు 769 పరుగులు చేశాడు. ఇప్పుడు దాన్ని కూడా బద్దలుకొట్టడం విశేషం.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.