close

తాజావార్తలు

రహానె ‘హిట్‌’ జోడీ

తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ 224/3

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి 224/3 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (117*; 164 బంతుల్లో 14 ఫోర్లు, 4 ) శతకంతో చెలరేగాడు. హిట్‌మ్యాన్‌కు తోడుగా వైస్‌కెప్టెన్‌ అజింక్య రహానె (83*; 135 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్) కూడా అర్ధశతకంతో మెరవడంతో.. మొదటిరోజు సఫారీలపై భారత్‌ పైచేయి సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోహ్లీసేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా పేసర్ రబాడ (2/53) ధాటికి టీమ్‌ఇండియా ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ (10), నయావాల్‌ పుజారా (0) 16 పరుగులకే వెనుదిరిగారు. కొద్దిసేపటికే సారథి విరాట్‌ కోహ్లీ (12) కూడా నోర్జె బౌలింగ్‌లో ఔటవ్వడంతో 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమ్‌ఇండియా కష్టాల్లో పడింది.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రహానెతో కలిసి హిట్‌మ్యాన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. చెత్తబంతుల్ని బౌండరీకి తరలిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. సఫారీ స్పిన్నర్‌ పీడ్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది టెస్టు కెరీర్‌లో ఆరో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్‌కు ఇది మూడో సెంచరీ. రహానెతో కలిసి రోహిత్‌ నాలుగో వికెట్‌కు అజేయంగా 185 పరుగులు జోడించాడు. సఫారీలపై నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన భారతజోడీగా రహానె-హిట్‌మ్యాన్‌ నిలిచారు. అంతకుముందు ఈ రికార్డు కోహ్లీ-రహానె (178) పేరిట ఉండేది. వెలుతురు లేమి కారణంగా మొదటి రోజు 58 ఓవర్ల పాటే ఆట కొనసాగింది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.