close

తాజావార్తలు

ద్విశతకానికి చేరువలో రోహిత్‌శర్మ

రాంచీ: టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(199 నాటౌట్‌; 242 బంతుల్లో 28x4, 4x6), వైస్‌కెప్టెన్‌ అజింక్య రహానె(115; 192 బంతుల్లో 17x4, 1x6) రెండో రోజు చెలరేగడంతో భారత జట్టు భారీ స్కోర్‌ దిశగా పయనిస్తోంది. లంచ్‌ విరామానికి 85 ఓవర్లలో టీమిండియా 357/4తో నిలిచింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 224/3తో రెండో రోజు ఆటను కొనసాగించిన రోహిత్‌, రహానె బాధ్యతగా ఆడుతూ జట్టు స్కోరును 300 దాటించారు. ఈ నేపథ్యంలో రహానె శతకం చేయగా రోహిత్‌ 150 పరుగులు దాటాడు. అనంతరం రహానె ఔటవ్వగా క్రీజులోకి వచ్చిన జడేజా(15; 27 బంతుల్లో 2x4) హిట్‌మ్యాన్‌కు అండగా నిలిచాడు. దీంతో లంచ్‌ విరామానికి భారత్‌ 357/4తో పటిష్ఠస్థితిలో నిలిచింది. 

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.