close

తాజావార్తలు

రోహిత్‌ను ఆపడం మావల్ల కాలేదు: బంగ్లా సారథి

బ్యాటింగ్‌ వైఫల్యమే బంగ్లా ఓటమికి కారణం

రాజ్‌కోట్‌: టీమిండియాతో రెండో టీ20లో ఓటమికి మిడిలార్డర్‌ కుప్పకూలడమే కారణమని బంగ్లాదేశ్ సారథి మహ్మదుల్లా అన్నాడు. బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు జోరు పెంచడంలో విఫలమయ్యామని పేర్కొన్నాడు. భారత స్పిన్నర్లు యుజువేంద్ర చాహల్‌ (2/28), వాషింగ్టన్‌ సుందర్‌ (1/25) మధ్య ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో బంగ్లా 153/6కు పరిమితమైంది.

‘మేం మరీ ఎక్కువ మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విభాగాల్లో చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు. మేం జోరు అందుకోవడంలో విఫలమయ్యాం. 170 పరుగులు చేయాల్సింది. ఎందుకంటే 12 ఓవర్ల తర్వాత మేం 102-103 వద్ద ఉన్నాం. మిడిలార్డర్‌లో వికెట్లు చేజార్చుకోవడం నష్టం కలిగించింది. వాటిపైనే మేం దృష్టిపెట్టాలి. ఇది 180 పరుగుల వికెట్‌. ఓపెనర్లు శుభారంభం అందించారు. మ్యాచ్‌ వేగాన్ని మేం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎదురయ్యే ప్రమాదాలేంటో అర్థం చేసుకోవాల్సి ఉంది. వాటిని గుర్తించడంలో విఫలమయ్యాం’ అని మహ్మదుల్లా అన్నాడు.

‘టీ20 మ్యాచ్‌లో 40 కన్నా ఎక్కువ బంతులు వృథా చేస్తే గెలవడం కష్టం. మేం 38 బంతులు వృథా చేశాం. మేం చాలా విభాగాల్లో మెరుగవ్వాలి. మా బ్యాట్స్‌మెన్‌ ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. అలా చేయలేదు. ఇది మా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యమే. 154 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్‌ శర్మను ఆపడం మా వల్ల కాలేదు. అతడు జోరుమీదున్నాడు. మేం 175+ స్కోరు చేసుంటే కాపాడుకొనేందుకు ప్రయత్నించేవాళ్లం. రాజ్‌కోట్‌ తరహా వికెట్లపై రోహిత్‌, ధావన్‌ను ఆపడం చాలా కష్టం. ముష్ఫికర్‌ ఔటైన విధానంలో తప్పులేదు’ అని మహ్మదుల్లా పేర్కొన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.