close

తాజావార్తలు

అఫ్గాన్‌ను వైట్‌వాష్ చేసిన విండీస్‌

లఖ్‌నవూ: హోప్‌ (109*) శతకంతో చెలరేగగా ఆఖరి వన్డేలోనూ అఫ్గానిస్థాన్‌ను వెస్టిండీస్‌ చిత్తుచేసి 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో విండీస్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌.. అస్గర్‌ (86), హజ్రతుల్లా (50), మహమ్మద్‌ నబీ (50*) అర్ధశతకాలతో రాణించగా ఏడు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. వెస్టిండీస్‌ బౌలర్లలో కీమో పాల్ (3/44), అల్జారీ జోసెఫ్ (2/59) సత్తా చాటారు. అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ముజీబ్‌ ధాటికి (2/49) నాలుగు పరుగులకే వెస్టిండీస్‌ రెండు వికెట్లు కోల్పోయింది. అయినా హోప్‌ అఫ్గాన్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని జట్టును విజయతీరాలకు చేర్చాడు. వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌లో ఛేజ్‌ (42*), బ్రాండన్ (39), పొలార్డ్‌ (32) రాణించారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.