
తాజావార్తలు
టీ20 సిరీస్ గెలుపుపై స్పందించిన షోయబ్ అక్తర్
ఇస్లామాబాద్: బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్ గెలిచిన టీమిండియాను క్రికెట్లో ‘బాస్’గా అభివర్ణించాడు పాకిస్థాన్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్. మూడో టీ20లో భారత్ విజయం సాధించిన తర్వాత తన యూట్యూబ్ ఛానల్లో స్పందించిన మాజీ బౌలర్ రోహిత్ సేనను కొనియాడాడు. ‘ఈ మ్యాచ్‌లో బాస్ ఎవరో టీమిండియా నిరూపించింది. తొలి టీ20లో ఓటమిపాలైనప్పటికీ తిరిగి పుంజుకొని సిరీస్‌లో పైచేయి సాధించింది. రోహిత్ గొప్ప నైపుణ్యం గల ఆటగాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పరుగులు చేయగలడు’ అని మెచ్చుకున్నాడు.
‘ఇరు జట్ల మధ్య జరిగిన మూడో టీ20 బాగా జరిగింది. అయితే.. టీమిండియా అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయినా బంగ్లాదేశ్‌కు హ్యాట్సాఫ్. ఆ జట్టు కూడా స్ఫూర్తిమంతమైన ప్రదర్శన చేసింది. నయీమ్(81) అద్భుతంగా బ్యాటింగ్ చేసి రంజింపజేశాడు. బంగ్లా ఇప్పుడు మామూలు జట్టు కాదు. ఇతర దేశాల ముందు బంగ్లా పులులు ఉక్కిరిబిక్కిరి కారనే విషయాన్ని మనమంతా గుర్తుంచుకోవాలి’ అని పేర్కొన్నాడు. ఇక టీమిండియా యువ సంచలనం దీపక్ చాహర్‌పై స్పందిస్తూ.. అతడి బౌలింగ్‌లో మీడియం పేస్, సీమ్ కలిసుందని చెప్పాడు. చివర్లో హ్యాట్రిక్ సాధించి ప్రశంసనీయమైన ప్రదర్శన చేశాడని అక్తర్ ప్రశంసలు కురిపించాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పోలీసులపై పూల జల్లు
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
- నాడు స్వప్నిక.. నేడు దిశ!