close

తాజావార్తలు

డే/నైట్‌ టెస్టు రాత్రి 8 వరకే!

కోల్‌కతా: భారత్‌×బంగ్లాదేశ్‌ మధ్య జరగనున్న చారిత్రక డే/నైట్ టెస్టు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించనున్నారు. కోల్‌కతా వేదికగా నవంబర్‌ 22 నుంచి డే/నైట్ టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే రాత్రి 8 గంటల తర్వాత మంచు ప్రభావం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ముందుగానే మ్యాచ్‌ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారి తెలిపారు. ‘బంగాల్‌ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్‌) అభ్యర్థన మేరకు ఆట నిర్వహణ సమయంలో మార్పులు చేస్తున్నాం. మ్యాచ్‌ను మధ్యాహ్నం 1 గంటకి ప్రారంభిస్తాం. తొలి సెషన్‌ మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది. 3:40కి ప్రారంభమయ్యే రెండో సెషన్‌ 5:40వరకు కొనసాగుతుంది. ఆఖరి సెషన్‌ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. దీంతో మ్యాచ్‌పై మంచు తీవ్రత అంతగా ఉండదు’ అని పేర్కొన్నారు.    

మంచు ప్రభావాన్ని అధిగమించడానికి మ్యాచ్‌ను ముందుగా నిర్వహించాలని క్యాబ్‌ క్యురేటర్‌ సుజన్‌ తెలిపారు. ‘మంచు తీవ్రత రాత్రి 8-8.30 నుంచి అధికమవుతుందని గత కొన్ని మ్యాచుల్లో పరిశీలించాం. దీంతో మ్యాచ్‌ సమయాల్లో మార్పులు చేస్తే ఆ సమస్యను అధిగమించవచ్చు. సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు సిద్ధం చేసే పిచ్‌లనే డే/నైట్ టెస్టుకు తయారుచేస్తాం. దీనిలో పెద్దగా మార్పులు ఏమి ఉండవు’ అని వెల్లడించారు. భారత్‌ ఆడుతున్న తొలి డే/ నైట్‌ టెస్టు తొలి మూడు రోజులు 50 వేల మంది ప్రేక్షకులు హాజరుకావచ్చని అంచనా వేస్తున్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.