close

తాజావార్తలు

బాల్‌ టాంపరింగ్‌: నికోలస్‌పై నిషేధం

దుబాయ్‌: వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్ నికోలస్‌ పూరన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నాలుగు మ్యాచ్‌లు నిషేధం విధించింది. లఖ్‌నవూ వేదికగా సోమవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు బాల్‌టాంపరింగ్‌కు పాల్పడినందుకు ఐసీసీ ఈ శిక్షను విధించింది. ఐసీసీ ఆర్టికల్‌ 2.14 నిబంధనల ప్రకారం నికోలస్‌ లెవల్‌-3 తప్పుని చేశాడని ఐసీసీ తెలిపింది. తను చేసిన పొరపాటుని నికోలస్‌ మంగళవారం అంగీకరించాడు. ‘నేను చేసిన పొరపాటుకి క్షమాపణలు కోరుతున్నాను. దీనిపై ఐసీసీ ఎటువంటి చర్యలు తీసుకున్నా అంగీకరిస్తాను. దీనిని ఎన్నటికీ పునరావృతం చేయను’ అని తెలిపాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 5 డీమెరిట్‌ పాయింట్లు ఉన్నాయి. అఫ్గాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను విండీస్‌ 3-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.