
తాజావార్తలు
ముంబయి: ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయడమంటే మాటలా? ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించింది ఇద్దరే ఇద్దరు. ఒకరు ఇంగ్లాండ్‌కు చెందిన జిమ్‌లేకర్. మరొకరు టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్‌కుంబ్లే. 1999లో ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో చిరకాల శత్రువు పాకిస్థాన్‌పై జంబో ఈ ఘనత అందుకున్నాడు. తొమ్మిదో వికెట్ తర్వాత దాదాపు ఈ చారిత్రక రికార్డు నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని వీవీఎస్ లక్ష్మణ్‌తో జరిగిన ‘వెరీ వెరీ స్పెషల్’ కార్యక్రమంలో కుంబ్లే వివరించారు.
సక్లైన్ ముస్తాక్ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత జవగళ్ శ్రీనాథ్ వేసిన బంతి వకార్ యూనిస్ బ్యాటు అంచుకు తగిలి గాల్లోకి లేచింది. వెంటనే దానిని అందుకొనేందుకు టీమిండియా మాజీ క్రికెటర్ శఠగోపన్ రమేశ్ పరుగెత్తాడు. ఆ క్యాచ్ వదిలేయాలన్నది టీమిండియా ముందస్తు ప్రణాళిక. రమేశ్ దానిని పట్టించుకోకుండా బంతికోసం వెళ్లాడు. చివరికి ఆ బంతి ఫీల్డర్లు లేనిచోట పడింది.
‘అతడు (రమేశ్) ఆ క్యాచ్ వదిలేయాలి. అదే జట్టు ఉద్దేశం’ అని కుంబ్లే అన్నాడు. ‘జట్టు ప్రణాళికను రమేశ్ విన్నాడని అనిపించలేదు. అతనలాగే కనిపించాడు మరి. నేను 9 వికెట్లు తీసిన విషయం, పదో వికెట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి అతడు బహుశా మర్చిపోయి ఉంటాడు. అందుకే ఆ క్యాచ్ కోసం పరుగెత్తాడు’ అని కుంబ్లే వివరించాడు. మరికాసేపటికే వసీమ్ అక్రమ్ వికెట్ దక్కడంతో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన భారత క్రికెటర్‌గా జంబో చరిత్ర సృష్టించాడు. ఆ మ్యాచ్‌ను భారత్ 212 పరుగుల తేడాతో గెలిచింది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత