close

తాజావార్తలు

పింక్‌బాల్ టెస్ట్‌ కోసం ఆతృతగా ఉన్నా

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ

కోల్‌కతా: భారత్‌లో తొలిసారిగా జరుగుతన్న డేనైట్‌ టెస్ట్‌ కోసం ఎదురు చూస్తున్నానని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ పేర్కొన్నారు. అభిమానులకు కూడా ఈ టెస్టు వినోదాన్ని పంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. రేపు డేనైట్‌ టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా సారథి మీడియాతో మాట్లాడాడు.

‘గులాబీ బంతి టెస్టు కోసం చాలా ఆతృతగా ఉన్నాను. ఈ బంతితో ఆడటం మాలో చాలా మందికి కొత్తే. ఈ టెస్టు మాకు పెద్ద సవాల్‌ వంటిది. ఈ మ్యాచ్‌ కోసం మేం నెట్స్‌లో చాలా శ్రమించాం. ఇది మా నైపుణ్యాన్ని పరీక్షించే టెస్టు. ల్యాండ్‌ మార్క్‌ వేడుక ఇది. టెస్టుల్లో టీమిండియా రాణిస్తోంది. అందుకే ఈ టెస్టును కూడా మేం సవాలుగా తీసుకుని చారిత్రక గెలుపుతో ముగిస్తాం’ అని కోహ్లీ తెలిపాడు. భారత్‌లో తొలి డేనైట్‌ టెస్టు శుక్రవారం ప్రారంభం కానుంది. భారత్‌-బంగ్లాల మధ్య ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ టెస్టు ప్రారంభోత్సవానికి క్రికెట్‌ ప్రముఖులు హాజరుకానున్నారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.