close

తాజావార్తలు

విజృంభించిన విరాట్‌.. టీమిండియా విజయం

హైదరాబాద్‌: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(94; 50 బంతుల్లో 6x4, 6x6) చెలరేగడంతో భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. షిమ్రన్‌ హెట్మేయర్‌(56; 41 బంతుల్లో 2x4, 4x6), ఎవిన్‌ లూయిస్‌(40; 17 బంతుల్లో 3x4, 4x6) ధాటిగా ఆడి.. ఆ జట్టు భారీ స్కోర్‌ సాధించడానికి పునాదులు వేశారు. తర్వాత పోలార్డ్‌(37), జేసన్‌ హోల్డర్‌(24) విరుచుకుపడడంతో కరీబియన్‌ జట్టు రెండు వందల స్కోర్‌ దాటింది. భారత బౌలర్లలో చాహల్‌ రెండు వికెట్లు తీయగా.. దీపక్‌ చాహర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్‌ రోహిత్‌శర్మ(8) వికెట్‌ కోల్పోయింది. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (62; 40 బంతుల్లో 5x4, 4x6), కోహ్లీతో జత కట్టి వంద పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఈ క్రమంలో ధాటిగా ఆడిన రాహుల్‌ అర్ధశతకం తర్వాత ఔటయ్యాడు. అనంతరం కోహ్లీ, పంత్‌(18;9 బంతుల్లో 2x6)తో కలిసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఆఖర్లో పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌(4) ఔటైనా కెప్టెన్‌ ధాటిగా ఆడి అద్భుత విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‌లో విశేషాలు: 

* టీ20ల్లో టీమిండియాకు ఇదే అత్యుత్తమ విజయం

* పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన విరాట్‌ కోహ్లీ (94)

*2009లో శ్రీలంకపై 207 పరుగుల ఛేదన రికార్డును అధిగమించిన భారత్‌

* 200 పై చిలుకు స్కోరును ఛేదించడం టీమిండియా జట్టుకు ఇది మూడో సారి

* 2013లో ఆస్ట్రేలియాపై 202 పరుగుల టార్గెట్‌ను ఛేదించిన భారత్‌.

* టీ20ల్లో అత్యధిక పరుగులు సమర్పించిన విండీస్‌ బౌలర్‌ కేసరిక్‌ విలియమ్స్‌. 3.4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 60 పరుగులు ఇచ్చాడు.

* టీ20ల్లో విండీస్‌పై భారత జట్టుకు ఇది వరుసగా 7వ విజయం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.