close

తాజావార్తలు

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌కు సింధు ఎంపిక

చోటు దక్కించుకోలేకపోయిన ఇతర భారత షట్లర్లు

గ్వాంజు: డిసెంబర్‌ 11 నుంచి చైనాలో జరిగే బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ 2019లో భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు అతికష్టం మీద చోటు దక్కించుకుంది. చైనా క్రీడాకారిణులు చెన్‌ యుఫీ, హీ బింగ్జియో, జపాన్‌ క్రీడాకారిణి అకానె యమగుచిలతో కలిసి గ్రూప్‌ ఏలో స్థానం సంపాదించింది. బుధవారం తొలి మ్యాచ్‌లో యమగుచితో తలపడనుంది. కాగా, ఈ పోటీల్లో నిలవడానికి సింధు టాప్‌ 8లో లేకపోయినా ప్రపంచ ఛాంపియన్‌ అయినందున ఆమెకు అవకాశం లభించింది. ఈ ఏడాది బాసెల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీడబ్ల్యూఎఫ్‌ పోటీలకు అర్హత సాధించిందని తెలుస్తోంది. 

మరోవైపు గ్రూప్‌ బీలో ప్రపంచ నెంబర్‌ వన్‌ క్రీడాకారిణి తై జు యింగ్‌, మాజీ ఛాంపియన్‌ నొజోమి ఒకుహరతో పాటు థాయిలాండ్‌కు చెందిన బుసనన్‌ చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా సింధు ఇటీవలి కాలంలో పెద్దగా రాణించలేకపోయింది. ఆగస్టులో జరిగిన బాసెల్‌ ఛాంపియన్‌షిప్‌ తర్వాత వరుసగా విఫలమైంది. ఆ మెగా ఈవెంట్‌ తర్వాత జరిగిన అన్ని టోర్నీల్లో ఆమె క్వార్టర్‌ ఫైనల్‌కి కూడా చేరకుండా గ్రూప్‌ దశలోనే వెనుతిరిగింది. దీంతో సింధు ఫామ్‌ ఆందోళన కలిగిస్తోంది. ఇక బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌కు సింధు మినహా ఏ ఒక్క భారత షట్లర్‌ ఎంపికవ్వకపోవడం గమనార్హం.

గ్రూప్‌ ఏలో సింధు గత ప్రదర్శనలు:
చెన్‌ యుఫీపై : 6 విజయాలు, 3 ఓటములు
అకానె యమగుచి: 10 విజయాలు, 6 ఓటములు
హి బింగ్జియో: 5 విజయాలు, 9 ఓటములు



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.