close

సంక్షేమ పాఠశాలలు బాగున్నాయ్‌

తెలంగాణకు పుదుచ్చేరి మంత్రుల ప్రశంస

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: పుదుచ్చేరిలో తెలంగాణ తరహా సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కమలాకరన్‌ తెలిపారు. ఆ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి ఖండసామితో కలిసి గురువారం ఆయన గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలను సందర్శించారు. తెలంగాణలో సాంఘిక సంక్షేమ పాఠశాల విద్య బాగుందని ఈ సందర్భంగా కమలాకరన్‌ ప్రశంసించారు. సీఎం కేసీఆర్‌ విద్యావ్యవస్థలో తీసుకువచ్చిన ప్రగతిపై టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పుదుచ్చేరి బృందానికి అవగాహన కల్పించారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.