close
ఎన్నికలకు అనర్హులుగా ప్రకటించడం చెల్లదు

గత పంచాయతీ ఎన్నికల ఖర్చులు చూపలేదని ఇప్పుడు వేటు తగదు
ఎన్నికల సంఘం ఆదేశాలను నిలిపివేసిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: గత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి, ఖర్చుల వివరాలను సమర్పించని అభ్యర్థులను మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించలేదన్న కారణంగా మూడేళ్లపాటు ఎన్నికల్లో పాల్గొనరాదంటూ ఇటీవల ఎన్నికల సంఘం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి తదితర జిల్లాల నుంచి సుమారు 100కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సంక్రాంతి సెలవుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.కేశవరావు గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2013లో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఖర్చుల వివరాలు సమర్పించలేదన్న కారణంగా ఎన్నికల సంఘం సుమారు 1,200 మందిపై అనర్హత వేటు వేసిందన్నారు. అప్పట్లో మౌనంగా ఉండి ఇప్పుడు అనర్హత వేటేయడం సరికాదన్నారు.   వాదనలు విన్న న్యాయమూర్తి ఈసీ ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

* గిరిజన గ్రామాల్లో వంద శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లలో ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పంచాయతీ రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని, దీని ప్రకారం గిరిజన ప్రాంతాల్లో 100 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ దశలో వీటిపై విచారణ చేపట్టలేమంటూ విచారణను కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.