close

వసతి గృహాల్లో ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌

 బీసీశాఖలో ప్రయోగాత్మక ప్రాజెక్టు విజయవంతం
 వచ్చే విద్యాసంవత్సరం నుంచి వసతిగృహాలన్నింటిలో అమలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలు కానుంది. సాంకేతిక సమస్యల వల్ల వేలిముద్రల వ్యవస్థ విఫలం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని తొలుత ప్రయోగాత్మకంగా బీసీ సంక్షేమ వసతిగృహాల్లో ప్రారంభించింది. విద్యార్థుల హాజరును పరిశీలిస్తూ ఆ మేరకు నిధులు విడుదల చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మిగతా సంక్షేమ వసతి గృహాల్లోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్‌ (టీఎస్‌టీఎస్‌) సహాయం తీసుకుంటోంది. విద్యార్థుల హాజరు, సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.
వసతిగృహాల్లో చేతిరాత హాజరుతో గందరగోళ పరిస్థితులతో పాటు నిధుల వినియోగంలోనూ సమస్యలు ఎదురయ్యాయి. దీంతో విద్యార్థుల హాజరు మేరకు నిధులు ఖర్చు చేయాలని భావించిన ప్రభుత్వం బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు వసతి గృహాల్లో అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోవడం, కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలతో పూర్తిస్థాయిలో అమలు జరగలేదు. మళ్లీ చేతిరాతతో హాజరు వేయడం మొదలు పెట్టారు. కొన్నిచోట్ల రికార్డుల్లో చూపిస్తున్న హాజరు, అక్కడుంటున్న విద్యార్థుల సంఖ్యలో తేడాలు ఉన్నట్లు అధికారులు గమనించారు. ఈ నేపథ్యంలో నిర్వహణలో అవకతవకలను నివారించేందుకు వీలుగా ప్రభుత్వం ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ వ్యవస్థ అమల్లోకి తెచ్చింది. బీసీ శాఖ కమిషనరేట్‌ పరిధిలోని కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థతో విద్యార్థులు, సిబ్బంది హాజరు తెలుస్తోంది. బీసీ సంక్షేమశాఖలో చేపట్టిన ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లోనూ అమలు చేయాలని ఆయా సంక్షేమశాఖల ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.