close
‘గాంధీ’లో స్వైన్‌ఫ్లూతో ఇద్దరి మృతి

గాంధీఆసుపత్రి, న్యూస్‌టుడే: గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు స్వైన్‌ఫ్లూ బాధితులు మృతిచెందారు. ఇబ్రహీంపట్నం తుక్కుగూడకు చెందిన యువతి(24)కి తీవ్రజ్వరం రావడంతో కొత్తపేటలోని ఓ ప్రైవేటుఆసుపత్రిలో చేర్పించారు. స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి ఈనెల 1వ తేదీన తరలించారు. అప్పటి నుంచి ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. బుధవారం అర్ధరాత్రి మృతిచెందింది. దమ్మాయిగూడకు చెందిన మహిళ(80) తీవ్ర అస్వస్థతకు గురికావడంతో నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. స్వైన్‌ఫ్లూ అని నిర్ధారించడంతో ఈనెల 6వ తేదీన గాంధీఆసుపత్రికి తరలించారు. గురువారం ఉదయం ఆమె కన్నుమూసింది. ఈ ఇద్దరి మరణాలతో ఇప్పటివరకు ఆసుపత్రిలో మృతిచెందినవారి సంఖ్య 14కుచేరింది. ప్రస్తుతం ఆసుపత్రిలో అయిదుగురు స్వైన్‌ఫ్లూ రోగులతోపాటు మరో నలుగురు అనుమానితులున్నారు.

 

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.