close

వారాంతానికి పీజీటీ ఎంపిక పూర్తి

జేఎల్‌, డీఎల్‌ ఫలితాలకు కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: తన పరిధిలో చేపట్టిన పీజీటీ నియామకాల ప్రక్రియను వారాంతంలోగా పూర్తిచేయాలని గురుకుల బోర్డు భావిస్తోంది. సోషల్‌స్టడీస్‌ మినహా, ఇప్పటికే అన్ని సబ్జెక్టులకూ సంబంధించి నియామక జాబితాను వెల్లడించింది. ఆ స్టడీస్‌ నియామకాల అర్హతపై స్పష్టత రావడంతో, పని శనివారం నాటికి ముగించాలన్న లక్ష్యం పెట్టుకుంది. అదే సమయంలో జేఎల్‌, డీఎల్‌ పరీక్షల ఫలితాలు వెలువరించేందుకు కసరత్తు చేస్తోంది. ఆ తర్వాత గురుకులాల్లో టీజీటీ నియామకాలను బోర్డు చేపట్టనుంది. పీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి.. ఇతర పోస్టులకు అర్హతను స్వచ్ఛందంగా వదిలేసుకునేవారి నుంచి హామీ పత్రాలు తీసుకుంటోంది. రెండురకాల పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థి ఒక పోస్టు వదిలేసుకుంటే, ఆ స్థానంలో అర్హులైన అభ్యర్థులను ఎంపికచేసే వీలుంటుందని తలుస్తోంది. అందువల్ల బ్యాక్‌లాగ్‌ ఖాళీల సంఖ్యను తగ్గించవచ్చని బోర్డు అభిప్రాయపడుతోంది. పీజీటీకి ఎంపికైన అభ్యర్థులందరినుంచీ ఈ-మెయిల్‌, రిజిస్టరు పోస్టు ద్వారా ఈ మేరకు హామీలు తీసుకుంటున్నారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.