close
తెలంగాణ పర్యాటక థీమ్‌ సాంగ్‌కు జపాన్‌ అవార్డు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పర్యాటక అందాలకు జపాన్‌ వరల్డ్‌ టూరిజం ఫెస్టివల్‌ ఫిదా అయ్యింది. జపాన్‌లోని ఒసాకా నగరంలో మార్చి 13, 14 తేదీల్లో జరిగిన ‘వరల్డ్‌ టూరిజం ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ‘థీమ్‌సాంగ్‌ ఆఫ్‌ తెలంగాణ’కు అవార్డు లభించింది. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల అందాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. బెస్ట్‌ ఫిల్మ్‌ ఇన్‌ కల్చరల్‌ టూరిజం విభాగంలో ఈ అవార్డును తెలంగాణ దక్కించుకుంది. గురువారం రాత్రి ముగింపు ఉత్సవాల్లో డాక్యుమెంటరీ ఫిల్మ్‌ డైరెక్టర్‌ డి.సత్యనారాయణ అవార్డును అందుకున్నారు. తెలంగాణ థీమ్‌ సాంగ్‌కు పురస్కారం రావడం పట్ల పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి వెంకటేశం హర్షం వ్యక్తం చేశారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.