close

నేటి నుంచి ఒంటిపూట బడులు

ఈనాడు, హైదరాబాద్‌: వేసవి దృష్ట్యా తెలంగాణలో శుక్రవారం నుంచి ఒంటిపూట తరగతులు ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఏప్రిల్‌ 12 వరకు (విద్యా సంవత్సరం చివరి తేదీ) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు ఉంటాయని పేర్కొన్నాయి. పదోతరగతి పరీక్షల నేపథ్యంలో కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయని వివరించారు. అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులు, ప్రాంతీయ సంచాలకులను ఆయన ఆదేశించారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.