close
తితిదేలో ఆడిట్‌ అభ్యర్థనపై వాదనలు పూర్తి

స్వామి పిటిషన్‌పై నిర్ణయం వాయిదా వేసిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) చెందిన గత మూడేళ్ల ఖర్చులపై బయటి వ్యక్తులతో ఆడిట్‌ నిర్వహించేలా ఆదేశించాలని అభ్యర్థిస్తూ రాజ్యసభ సభ్యుడు, భాజపా నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం నిర్ణయాన్ని వాయిదా (రిజర్వు) వేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. సోమవారం విచారణలో సుబ్రమణ్యస్వామి నేరుగా వాదనలు వినిపిస్తూ.. దేవాలయాల నిర్వహణలో వివాదం తలెత్తినప్పుడే పరిపాలనాంశాల్లో ప్రభుత్వానికి పరిమిత కాలంతో అజమాయిషీ ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఆలయాల నిర్వహణ ప్రభుత్వం పనికాదని స్పష్టంగా పేర్కొందని తెలిపారు. సర్కారు తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. తితిదే విషయంలో ప్రభుత్వ జోక్యం లేదని తెలిపారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.