close

ప్రధానాంశాలు

పోలీసు బందోబస్తు మధ్య ఆది అత్తి వరధర్‌

సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటిలో ఆది అత్తివరధర్‌ విగ్రహం

కాంచీపురం, న్యూస్‌టుడే: అనంత సరస్సు నుంచి 40 సంవత్సరాల తర్వాత ఆది అత్తివరధర్‌ను బయటకు తీసి భారీ పోలీసు బందోబస్తు మధ్య వసంత మంటపంలో ఉంచారు. కాంచీపురంలోని దివ్య దేశల్లో వరవరాజ పెరుమాళ్‌ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో 40 సంవత్సరాలకు ఒకసారి ఆది అత్తివరధర్‌ వైభవం జులై 1వ తేదీ నుంచి 48 రోజుల పాటు జరగనుంది. జిల్లా అధికారులతో పాటు దేవాదాయ శాఖ దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసింది. అందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని అనంత సరస్సు నుంచి ఆది అత్తివరధర్‌ను నీటిలోంచి బయటకు తీయడానికి నెల రోజుల క్రితం పనులు ప్రాంభమయ్యాయి. 15 రోజుల క్రితం నీటిని తోడే పనులు ప్రాంరభించిన సిబ్బంది మూడు రోజుల క్రితం సరస్సులో పేరుకుపోయిన పూడికను నాలుగు కాళ్ల మంటపం వద్ద తొలగించారు. శుక్రవారం వేకువజామున ఉన్నతాధికారుల సమక్షంలో స్వామి వారి విగ్రహాన్ని భారీ పోలీసు బందోబస్తు మధ్య వెలికితీసి ఆలయ ప్రాంగణంలోని వసంత మంటపానికి చేర్చారు. తరువాత దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో అర్చకులు శుభ్రం చేశారు. సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటితో అభిషేకం చేసి మొదటి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని శుభ్రం చేసిన ఇద్దరు అర్చకులు మాట్లాడుతూ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తమకు స్వామివారి విగ్రహాన్ని శుభ్రం చేసే భాగ్యం దక్కిందన్నారు. మొదటి పూజల అనంతరం వసంత మంటపాన్ని పూర్తిగా పోలీసులు తమ రక్షణ వలయంలోకి తీసుకున్నారు. దానిని సీలు వేసి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వసతం మంటపంలో ఆది అత్తివరధర్‌ను శయన అవతారంలో ఉంచడానికి ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.